ఎండాకాలం జుట్టు రాలకూడదంటే చేయాల్సింది ఇదే...!
మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, షాంపూలు తెచ్చి వాడేస్తూ ఉంటాం. కానీ.. వాటి కంటే.. మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దాని కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవ్వాలి.
ఎండాకాలం వచ్చింది అంటే.. విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమట కారణంగా.. మనకు తలలోనూ చిరాకు, దురద లాంటివి వస్తాయి. రెండు, మూడు రోజులకు ఒకసారి తలస్నానం చేసినా పెద్దగా ఫలితం ఉండదు. పైగా ఈ చెమట, దుర్వాసన కారణంగా జుట్టు కుప్పలు తెప్పలుగా ఊడిపోతుంది. మరి.. ఈ మండే ఎండల్లో జుట్టు రాలకుండా ఉండాలన్నా.. ఎక్కువ జుట్టు పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం...
1. ఈ ఎండల్లో మన శరీరాన్ని ఎలా హైడ్రేటెడ్ గా ఉంచుకుంటామో.. మన హెయిర్ ని కూడా హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే... వాటర్ తీసుకువచ్చి.. పదే పదే జుట్టును తడపమని కాదు.. మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే... ఆటోమెటిక్ గా హెయిర్ కూడా హైడ్రెటెడ్ గా ఉంటుంది. దీని కోసం.. వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి.
2.మనం జుట్టు పెరుగుతుంది.. రాలడం తగ్గుతుంది అని చెప్పగానే.. మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, షాంపూలు తెచ్చి వాడేస్తూ ఉంటాం. కానీ.. వాటి కంటే.. మనం సరైన ఆహారం తీసుకోవడం వల్ల మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దాని కోసం మంచి ఆరోగ్యకరమైన డైట్ ని ఫాలో అవ్వాలి. అంటే.. మీరు రోజువారీ తీసుకునే ఆహారంలో పాలకూర, గుడ్లు, నట్స్ తీసుకోవాలి. వీటిలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుంది.
3. మనం ఎంత మంచి ఆహారం తీసుకోవడం తో పాటు... మంచి హెయిర్ కేర్ రొటీన్ కూడా ఫాలో అవ్వాలి. ఊరుకూరికే హీట్ స్టైలింగ్ చేయకూడదు. ఇక... ఘాటుు ఎక్కువగా ఉండే షాంపూలను కూడా వాడకూడదు. సల్ఫేట్ ఫ్రీ, అలాగే.. మైల్డ్ గా ఉండేవి అంటే... ఘాటు తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకోవాలి. ఇవి హెయిర్ డ్యామేజ్ ని తగ్గస్తాయి.
4.మన తలలో రక్త ప్రసరణ జరిగా జరిగితే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే... రెగ్యులర్ గా జుట్టుకు మంచిగా మసాజ్ చేస్తూ ఉండాలి. అది కూడా స్కాల్ప్ మీద మసాజ్ చేయాలి. అప్పుడు... జుట్టు మరింత బాగా పెరుగుతుంది.
Handle hair gently
5.సూర్య కిరణాలు అంటే యూవీ కిరణాలు మనం చర్మాన్ని మాత్రమే కాదు.. మన జుట్టును కూడా ఎక్కువగా పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి... ఎండల్లో వెళ్లే సమయంలో జుట్టు ని కవర్ చేయాలి. హ్యాట్ లాంటివి పెట్టుకోవాలి. అంతేకాకుండా.. యూవీ ప్రొటక్టివ్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడాలి. అప్పుడు జుట్టు రాలే సమస్య ఉండదు.
6.జుట్టు పొడవుగా ఉండాలి అనుకునేవారు.. జుట్టును కత్తిరించడానికి ఇష్టపడరు. కానీ.. అలా అసలు కత్తిరిచంకపోతే.. కింద స్పిల్ట్స్ వచ్చి జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. అందుకే కింద చివర్లు అప్పుడప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడు.. మళ్లీ గ్రోత్ బాగుంటుంది.
7.ఇక.. జుట్టు కోసం ఏవేవో నూనెలు వాడకూడదు. చక్కగా సహజంగా మనకు లభించే.. కొబ్బరి నూనె వాడాలి. నిజానికి కొబ్బరి నూనె మాత్రమే.. మన జుట్టు బలంగా పెరగడానికి సహాయపడుతుంది.