వెస్టిండిస్‌తో జరుగుతున్న టీ20 సీరిస్లో కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొడుతున్న విషయం తెలిసిందే. రెండో టీ20 లో తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో చెలరేగుతూ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన పరుగుల ద్వారా టీ20లో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన కోహ్లీని(2,102)వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచాడు. అదే ఊపుతో చెన్నైలో జరిగే మూడో టీ20లో రోహిత్ ప్రంపంచ రికార్డుపై కన్నేశాడు.

లక్నోలో చెలరేగి ఆడుతూ సెంచరీ సాధించడం ద్వారా కేవలం కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డునే కాదు మరో రికార్డును కూడా రోహిత్ అధిగమించాడు. ఇప్పటివరకు టీ20లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కొలిన్ మన్రో(3 సెంచరీలు) నిలిచాడు. గతంలోనే ఇతడి రికార్డును సమం చేసిన రోహిత్ లక్నోలో సాధించిన సెంచరీ ద్వారా ఆ రికార్డును( 4 సెంచరీలు) అధిగమించాడు. 

ఇక చెన్నైలో జరగనున్న మాచ్‌లో రోహిత్ మరో 69 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు బద్దలవుతుంది. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గుప్తిల్ ఉన్నాడు. ఇతడి ఖాతాలో 2,271 పరుగులున్నాయి. ఈ జాబితాలో రెండో స్థానం రోహిత్ శర్మది.  ఇప్పటివరకు 2203 పరుగులు సాధించిన రోహిత్ నెంబర్ వన్‌లో నిలిచిన గప్తిల్ కంటూ కేవలం 69 పరుగులు వెనకబడి ఉన్నాడు. 

కెప్టెన్‌గా, బ్యాట్ మెన్ గా ఈ టీ20 సీరిస్ లో మంచి ఫామ్ తో రోహిత్ అదరగొడుతున్నాడు. ఇదే ఆటతీరు చెన్నై మ్యాచ్ లో కొనసాగితే ప్రపంచ రికార్డు నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది.  

మరిన్ని వార్తలు

వరల్డ్ కప్ కోసం కోహ్లీ ప్రతిపాదన.... వ్యతిరేకించిన రోహిత్

రెండో టీ20: విండీస్ చిత్తు, సిరీస్ భారత్ వశం

కోహ్లీ రికార్డుకు కేవలం 11పరుగుల దూరంలో రోహిత్...

కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ వరల్డ్ నెంబర్ వన్.....