ఈ ఫోటోను పోస్టు చేసి కేవలం ‘ఫన్ టైమ్స్’ అని ట్వీట్ చేసిన వీవీఎస్... అది ఎక్కడ దిగింది? ఎప్పుడు దిగింది? అందులో ఉన్న అందరి పేర్లు ఏమిటనే విషయాలను మాత్రం చెప్పలేదు.
దీంతో కనీసం ఎక్కడ దిగారో చెప్పండి సారూ... అని ఈ పోస్టుపై కామెంట్లు కురిపిస్తున్నారు అభిమానులు. 1996లో భారత క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాద బ్యాట్స్‌మెన్, టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

134 టెస్టులు ఆడిన లక్ష్మణ్, 8,781 పరుగులు చేశాడు. ఆసీస్‌పై ఫాలోఆన్ ఆడుతున్న సమయంలో వీవీఎస్ చేసిన అజేయ 281 పరుగుల వెరీ వెరీ స్పెషల్ ఇన్నింగ్స్‌, ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోయింది. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడినా, వీవీఎస్ లక్ష్మణ్ ఒక్క వరల్డ్ మ్యాచ్ కూడా ఆడకపోవడం విశేషం.