Asianet News TeluguAsianet News Telugu

టోక్యో ఒలింపిక్స్‌ : నీరజ్ చోప్రాకు ప్రధాని, రాష్ట్రపతి అభినందనలు

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంపై యావత్ దేశం అతనిపై ప్రశంసలు కురిపిస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను అభినందించారు.

History has been scripted PM narendra Modi tweets after Neeraj Chopra wins gold in Tokyo Olympics ksp
Author
new delhi, First Published Aug 7, 2021, 6:25 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంపై యావత్ దేశం అతనిపై ప్రశంసలు కురిపిస్తోంది. ఒలింపిక్ చరిత్రలో ఫీల్డ్ అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు దక్కిన మొట్టమొదటి పతకం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. నీరజ్ చోప్రాను అభినందించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారని మోడీ ప్రశంసించారు. నీరజ్ చోప్రా యువతకు స్పూర్తిగా నిలిచారని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కొనియాడారు. 

కాగా, మ్యాచ్ సందర్భంగా మొదటి ప్రయత్నంలోనే 87.03 మీటర్ల దూరం విసిరిన నీరజ్ చోప్రా... ఫస్ట్ రౌండ్‌లో టాప్‌లో నిలిచాడు. రెండో ప్రయత్నంలో మరింత మెరుగ్గా 87.58 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా... మూడో ప్రయత్నంలో 76.79 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. నాలుగో త్రో కూడా అనుకున్నంత లక్ష్యాన్ని చేరుకోకపోవడంతో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా... ఐదో త్రో కూడా ఫౌల్ చేశాడు. అయితే మొదటి రెండు త్రోల కారణంగా చివరివరకూ టాప్‌లో నిలిచిన నీరజ్ చోప్రా, స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 

Also Read:టోక్యో ఒలింపిక్స్: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా... టోక్యోలో టీమిండియాకి తొలి స్వర్ణం...

వరల్డ్ నెం.1 జర్మనీకి చెందిన జొన్నెస్ వెట్టర్, టాప్ 8లో స్థానం సంపాదించలేక, ఫైనల్ రౌండ్‌కి అర్హత సాధించలేకపోయాడు. క్వాలిఫికేషన్స్‌లో టాప్ 3లో ఉన్న పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం, ఫైనల్‌లో నిరాశపరిచాడు. నీరజ్ చోప్రా పతకంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 7కి చేరింది. ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇదే అత్యుత్తమ ప్రదర్శన...  ఇంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో 2 రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించింది టీమిండియా... 

 

 

 

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పూనియా కాంస్యం సాధించాడు. మెన్స్ ఫ్రీ స్టైయిల్ 65 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో కజికిస్తాన్‌కి చెందిన డౌలెట్ నియాజ్‌బెకావ్‌తో జరిగిన మ్యాచ్‌లో భజరంగ్ పూనియా 8-0 తేడాతో విజయాన్ని అందుకున్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios