ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా, హీరో సూర్యలకు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.  ఇంతకీ మ్యాటరేంటంటే... హీరో సూర్య ప్రస్తుతం తన కొత్త సినిమా ఎన్జీకే ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే... అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ చేశాడు. ఆ చాట్ లోకి అనూహ్యంగా క్రికెటర్ రైనా ఎంటర్ అయ్యాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీంలో మీకు నచ్చిన ప్లేయర్‌ ఎవరు అంటూ ప్రశ్నించాడు రైనా.

అయితే ఈ ట్వీట్‌ స్పందించిన సూర్య ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘మీరు, ధోని అంటే ఇష్టం. మంచి గాయకుడు సురేష్‌ రైనా.. గొప్ప చిత్రకారుడిగా ధోని అంటే ఇష్టం.ఎప్పటికీ సీఎస్‌కే ఫ్యాన్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు. సూర్య ఇచ్చిన స్వీట్ రిప్లై అటు రైనా, ఇటు సూర్య అభిమానులను ఆకట్టుకుంటోంది.