జాతీయ జట్టులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ క్రికెటర్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. జాకబ్ మార్టిన్ అనే క్రికెటర్ 1999లో విండీస్‌తో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు..

మొత్తం 10 వన్డేలు ఆడిన మార్టిన్, 2001లో బరోడా జట్టుకు రంజీ ట్రోఫీని అందించాడు. 138 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9,192 పరుగులు చేశాడు. కాగా గతేడాది డిసెంబర్ 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో జాకబ్ తీవ్రంగా గాయపడ్డాడు. కాలేయం, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి.

ప్రస్తుతం వడోదరలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతను ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. చికిత్స చేయించుకునేందుకు ఆర్ధిక స్తోమత సరిపోకపోవడంతో సాయం కోసం బీసీసీఐ వైపు చూస్తోంది అతని కుటుంబం. విషయం తెలుసుకున్న బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో కలిపి రూ.5 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది.

దీంతో పాటు మరిన్ని నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. ‘‘తనకు జాకబ్ పరిస్థితి తెలిసిన వెంటనే చేతనైన సాయం చేయాలని నిర్ణయించుకున్నానని బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు.  

కాగా, మార్టిన్ చికిత్స కోసం ఇప్పటికే అయిన ఖర్చు రూ.11 లక్షలు దాటిపోయింది. బిల్లులు చెల్లించని కారణంగా చికిత్సను ఆపేసింది. వెంటనే స్పందించిన బీసీసీఐ ఆసుపత్రి ఖాతాలో నగదు జమ చేయడంతో చికిత్స కొనసాగుతోంది. 

టెన్నిస్ కింగ్ అయితే ఏంటీ...గుర్తింపు కార్డ్ లేదని ఫెదరర్‌ను నిలబెట్టిన గార్డ్

క్రెడిట్ అనుష్కదే, దాని కన్నా క్రికెట్ ముఖ్యం కాదు: కోహ్లీ

విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన ఆమ్లా

రెండో బిడ్డకు ట్రై చేయ్: శ్రీశాంత్ కు భజ్జీ సూచన

మెల్ బోర్న్ వన్డే గెలుపుకు కారణాలివే: కేదార్ జాదవ్