ఒకవేళ తాను గతానికి వెళ్లి తాను  చేసిన తప్పు ఏదైనా సరిదిద్దుకోవాలంటే కచ్చితంగా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటానని భజ్జీ చెప్పాడు. అది తన తప్పేనని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అన్నాడు. 

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొలి సీజన్ లో శ్రీశాంత్ ను తాను చెంపపై కొట్టిన వివాదంపై హర్భజన్ సింగ్ స్పష్టత ఇచ్చారు. శ్రీశాంత్ కు క్షమాపణ కూడా చెప్పాడు. ఇదే సందర్భంలో రెండో సంతానం లేకపోతే ట్రై చేయాలని ఆయన సూచించాడు. ఓ ఇంటర్వ్యూలో అతను ఆ సంఘటనపై మాట్లాడారు.

మీ జీవితంలో ఏదైనా ఘటనను మార్చే అవకాశం ఉంటే దేన్ని మారుస్తారని అడిగితే... శ్రీశాంత్ తో వివాదంపై వివరణ ఇచ్చాడు. ఈ విషయాన్ని తాను కచ్చితంగా చెప్పాలని. శ్రీశాంత్‌కి తనకు మధ్య జరిగిన ఘటన గురించి ఇప్పటికీ చాలా చర్చ జరుగుతోందని అన్నాడు. 

ఒకవేళ తాను గతానికి వెళ్లి తాను చేసిన తప్పు ఏదైనా సరిదిద్దుకోవాలంటే కచ్చితంగా ఆ రోజు ఆ పని చేయకుండా ఉంటానని భజ్జీ చెప్పాడు. అది తన తప్పేనని, అందుకు తాను క్షమాపణ చెబుతున్నానని, ఆ ఘటన జరిగి ఉండకూడదని ఆయన అన్నాడు. 

శ్రీశాంత్ చాలా మంచి ఆటగాడని కూడా ఆయన కితాబు ఇచ్చాడు. "శ్రీశాంత్‌కు, అతని భార్యకు, పిల్లలకు నా అభినందనలు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుంటున్నా. శ్రీ.. ఒకవేళ ఒకరే సంతానం అయితే.. రెండో దాని కోసం ట్రై చేయి" హర్భజన్ చెప్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ తొలి సీజన్‌లో సీజన్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన హర్భజన్ వికెట్ తీసి శ్రీశాంత్ సెలబ్రేట్ తీసుకున్నాడు దీంతో రెచ్చిపోయి హర్భజన్ అతన్ని చెంప దెబ్బకొట్టాడు. అది వివాదంగా మారింది.

హర్భజన్ సింగ్ శ్రీశాంత్‌ను క్షమాపణ కోరినట్టు ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే,వాటిని హర్భజన్ ఖండించాడు. తాను ఎప్పుడు ఈ విషయంలో క్షమాపణ చెప్పలేదని హర్భజన్ చెప్పాడు.