ఆమ్లా 120 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 108 పరుగులు చేసి కెరీర్‌లో 27వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 169వ ఇన్నింగ్స్‌లో 27వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లలోనే ఆ ఘనత సాధించాడు. 

పోర్ట్ ఎలిజిబెత్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషీం ఆమ్లా బద్దలుగొట్టాడు. పాకిస్థాన్‌తో శనివారం జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన ఆమ్లా వన్డేల్లో అత్యంత వేగంగా 27 సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ మ్యాచ్‌లో ఆమ్లా 120 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 108 పరుగులు చేసి కెరీర్‌లో 27వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 169వ ఇన్నింగ్స్‌లో 27వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆమ్లా 167 ఇన్నింగ్స్‌లలోనే ఆ ఘనత సాధించాడు. 

2017 జనవరి 15వ తేదీన పుణే వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు.ఫామ్ కోల్పోయి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆమ్లా 15 నెలల తర్వాత సెంచరీ సాధించి కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.