హైదరాబాద్: కొత్త కోచ్ డబ్ల్యువీ రామన్ నేతృత్వంలో హైదరాబాదీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఫ్రెష్ స్టార్ట్ ఇవ్వబోతోంది. న్యూజిలాండ్ పర్యటనకు డబ్ల్యువీ రామన్ మార్గదర్శకత్వంలో మహిళా క్రికెట్ జట్టు వెళ్లనుంది. వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న రమేష్ పొవార్ ను కోచ్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

ఇది ఫ్రెష్ స్టార్ట్ అని భావిస్తున్నానని, కొత్త సంవత్సరంలో ఇది తొలి సిరీస్ అని, వివాదాలను పక్కన పెట్టామని మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. ఆదివారం న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. 

రామన్ అనుభవం తమకు ఎంతో ఉపకరిస్తుందని ఆమె అన్నారు. జట్టుకు ఏది ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై జట్టు సభ్యులు నిర్మొహమాటంగా కోచ్ తో చెప్పడానికి అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. 

తాను డబ్ల్యువీ రామన్ వద్ద శిక్షణ పొందలేదని, అయితే, రెండు సార్లు మాత్రం కలిశానని, ఆయన ఉన్నత స్థాయిలో క్రికెట్ ఆడారని, వివిధ స్థాయిల్లో వివిధ జట్లకు శిక్షణ ఇచ్చారని, అది ఆయన ప్రతిభను తెలియజేస్తుందని అన్నారు. 

కోచ్, కెప్టెన్ మధ్య అభిప్రాయభేదాలు ఉండవచ్చునని, అయితే కూర్చుని మాట్లాడుకుని పరిష్కారం చేసుకుంటామని, ఏది జట్టుకు మేలు చేస్తుందని భావిస్తే ఆ నిర్ణయం తీసుకుంటామని మిథాలీ రాజ్ అన్నారు.  

సంబంధిత వార్తలు

‘‘ఓవర్ చేయకు’’...పొవార్ లేనప్పుడే ఫైనల్‌కు వెళ్లాం: హర్మన్‌కు సంజయ్ కౌంటర్

మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్‌పై వేటు..?

ఆసీస్ తో ఢీ: భారత్ కు షాక్, పృథ్వీషాకు మోకాలి గాయం

నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్