సుమారు మూడు దశాబ్ధాల తరువాత 2011లో వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది టీమిండియా.. అది కూడా సొంతగడ్డలో, సొంత అభిమానుల సమక్షంలో.. అందుకే ఆ ప్రపంచకప్‌ భారత జట్టుకు ప్రత్యేకమైనది. వరల్డ్‌కప్‌ను సాధించిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనికి ఇది మోస్ట్ మెమొరబుల్. ఆ ఫైనల్‌ను మరోసారి గుర్తు చేసుకున్నాడు ధోని.

ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో యువరాజ్ రావాల్సిన స్థానంలో తాను రావడంపై క్లారిటీ ఇచ్చాడు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేంద్రుడు... ‘‘ 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం..

శ్రీలంక బౌలర్లలో చాలా మంది చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడిన వారే.. మురళీధరన్‌తో సహా.. దీంతో వారి బౌలింగ్‌లో చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్లం. ఆ అనుభవంతోనే వారిని ధీటుగా ఎదుర్కోవచ్చు అనే ఆలోచన వచ్చిందని.. దానిని ఆలస్యం చేయకుండా మేనేజ్‌మెంట్‌‌కు చెప్పానని వాళ్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిపాడు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి.

ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ వెంట వెంటనే ఔటవ్వడంతో ధోనీతో కలిసి గంభీర్ జట్టును ముందుకు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో ఫినిషింగ్ షాట్ కొట్టిన ధోని 3 దశాబ్ధాల తర్వాత భారత్‌కు ప్రపంచకప్‌ను అందించాడు. 

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

మహిళల టీ20 ప్రపంచకప్: ఇండియాను కట్టికరిపించి... ఫైనల్లో ఇంగ్లాండ్

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?

ధోనీ- సాక్షిల ప్రేమ, పెళ్లికి కారణం ఎవరో తెలుసా..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

ప్రపంచానికి తెలియని ద్రవిడ్ రికార్డును ప్రకటించిన బీసీసీఐ

‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...