Asianet News TeluguAsianet News Telugu

వెస్టిండిస్‌కు మరో ఎదురుదెబ్బ...వన్డే,టీ20 సీరిస్‌లకు గేల్ దూరం

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్లో ఇప్పటికే విండిస్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాజ్ కోట్‌లో జరిగిన మొదటి టెస్ట్ లో విండీస్ జట్టు భారత జట్టుకు కనీస పోటీని ఇవ్వలేకపోయింది. దీంతో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విండీస్ టీం పరాజయం పాలయ్యింది. ఇలా ఇప్పటికే కష్టాల్లో వున్న విండీస్ జట్టుకు ముందు ముందు మరిన్ని కష్టాలు ఎదురయ్యేలా కనిపిస్తోంది.

Chris Gayle Pulls Out Of ODI, T20 Series For West Indies Against India
Author
West Indies, First Published Oct 8, 2018, 3:56 PM IST

భారత్-వెస్టిండిస్ ల మధ్య జరుగుతున్న టెస్ట్ సీరిస్లో ఇప్పటికే విండిస్ జట్టు ఘోర పరాభవాన్ని చవిచూసింది. రాజ్ కోట్‌లో జరిగిన మొదటి టెస్ట్ లో విండీస్ జట్టు భారత జట్టుకు కనీస పోటీని ఇవ్వలేకపోయింది. దీంతో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో విండీస్ టీం పరాజయం పాలయ్యింది. ఇలా ఇప్పటికే కష్టాల్లో వున్న విండీస్ జట్టుకు ముందు ముందు మరిన్ని కష్టాలు ఎదురయ్యేలా కనిపిస్తోంది.

రెండు టెస్ట్ ల సీరిస్‌ను ఇప్పటికే కోల్పోయిన విండిస్‌కు వన్డే, టీ20 సీరిస్‌లకు ముందే ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు సీరిస్‌లకు వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ దూరమయ్యాడు. సోమవారం వెస్టిండిస్ సెలెక్షన్ కమిటీ భారత్ తో జరగనున్న వన్డే, టీ20 సీరిస్ లలో ఆడే విండీస్ ఆటగాళ్లను ప్రకటించింది.ఈ జాబితాలో గేల్ పేరు లేదు. అలాగే  స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ కు కూడా విండీస్ టీంలో చోటు దక్కలేదు.

వ్యక్తిగత కారణాలతో తాను ఈ సీరిస్ ఆడలేనని చెప్పడంతో అతన్ని సెలెక్ట్ చేయలేదని విండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ కౌర్ట్‌నీ బ్రౌన్ చెప్పారు. భారత్ తో జరుగుతున్న సీరిస్ తో పాటు బంగ్లాదేశ్ తో జరిగే సీరిస్‌కు కూడా అతడు దూరంగా ఉండనున్నట్లు బ్రౌన్ తెలిపాడు. 

ఇక మిగతా జట్టు సభ్యుల విషయానికి వస్తే డారెన్ బ్రావో, కిరన్ పొలార్డ్ వన్డే, టీ20 జట్టులోకి వచ్చారు. ఆండ్రీ రసెల్ వన్డే సిరీస్‌కు దూరం కాగా.. టీ20 సిరీస్ మాత్రం చోటు దక్కించుకున్నాడు. భారత్ లో జరిగే ఈ వన్డే సీరిస్ కు జేసన్ హోల్డర్, టీ20  సీరిస్ కు కార్లోస్ బ్రాత్‌వెయిట్ కెప్టెన్సీ వహించనున్నారు.  

సంబంధిత వార్తలు

 59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విష

కనీసం నాకు చెప్పలేదు.. మురళీ విజయ్ ఆవేదన

ఇది తెలుసా.. పృథ్వీషా కెరీర్ టర్న్ అయ్యింది మన ఒంగోలులోనే

సెల్ఫీ కోసం దూసుకొచ్చిన అభిమానులు.. చెబితే వినరా అంటూ కోహ్లీ సీరియస్

నా సెంచరీ ఆయనకే అంకితం :పృథ్విషా

 ఆసియా కప్ విశ్రాంతిపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ

విశాఖకు మారిన వేదిక: బిసిసిఐపై దుమ్మెత్తిపోసిన గంగూలీ

Follow Us:
Download App:
  • android
  • ios