ఆట తీరు సరిగా లేదని.. ఓవైపు కశ్యప్ సలహాలు.. సూచనలు ఇస్తున్నా పట్టించుకోకుండా ఆట ఆడి.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్  ఓటమిపాలయ్యింది.  ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ సిప్ లో భారత స్టార్స్ పోరాటం ముగిసింది. వరసగా 13వ సారి సైనా ఓటమి పాలయ్యింది.
భర్త పారుపల్లి కశ్యప్, మరో కోచ్‌ సియాదతుల్లా కోర్టు పక్కన కూర్చోని సలహాలు ఇచ్చినా సైనా పట్టించుకోలేదు. దీంతో  ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సైనా.. చైనాకి చెందిన తై జు యింగ్ తో తలపడింది. అయితే.. ఈ మ్యాచ్ లో సైనా అనవసర తప్పిదాలు చేసి.. మ్యాచ్ చేజార్జుకుంది. సైనా ఆట తీరు చూసి.. కశ్యప్ ఒకింత ఆగ్రహానికి లోనవ్వడం గమనార్హం.

మ్యాచ్‌ బ్రేక్‌ టైంలో ‘ఓయ్‌.. నువ్వు చెత్త షాట్స్‌ ఆడుతున్నావ్‌.. మ్యాచ్‌ గెలవాలని ఉంటే పరిస్థితి అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఆడు.’ అంటూ మందలించాడు. దీంతో సైనా కొంత పోరాట పటిమను ప్రదర్శించినప్పటికి తై జుయింగ్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో.. మ్యాచ్ సైనా చేతి నుంచి చేజారిపోయింది.