గ్రౌండ్ లో స్టెప్పులు వేసిన శిఖర్ దావన్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 8, Sep 2018, 3:09 PM IST
After Shikhar Dhawan, Harbhajan Singh and David Lloyd do bhangra in commentary box - watch video
Highlights

 గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తోన్న ‘భారత్‌ ఆర్మీ’ వారు డప్పులు మోగించారు. దీనికి అనుగుణంగా ధావన్‌ భాంగ్రా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. మైదానంలో ధావన్‌ స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

టీం ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ఆనందంతో గ్రౌండ్ లో స్టెప్పులు వేశారు. ఆయన వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. 

ప్రస్తుతం భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదో టెస్టు లండన్‌లో జరుగుతోంది. శుక్రవారం టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌లో భారత్‌ ఆడే అన్ని మ్యాచ్‌లకు ‘భారత్‌ ఆర్మీ’ హాజరై ఆటగాళ్లను ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇరు జట్ల మధ్య ప్రారంభమైన చివరి టెస్టుకు భారత ఆర్మీ హాజరైంది. మొదటి రోజు మూడో సెషన్‌లో ధావన్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. 

ఆ సమయంలో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తోన్న ‘భారత్‌ ఆర్మీ’ వారు డప్పులు మోగించారు. దీనికి అనుగుణంగా ధావన్‌ భాంగ్రా స్టెప్పులు వేసి అభిమానులను అలరించాడు. మైదానంలో ధావన్‌ స్టెప్పులేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధావన్‌ స్టెప్పులను చూసి కామెంటేటర్స్‌ రూమ్‌లో నవ్వులు విరిశాయి. అంతేకాదు ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న భజ్జీ మరో కామెంటేటర్‌ డేవిడ్‌ లాయిడ్‌కి భాంగ్రా స్టెప్పులు ఎలా వేయాలో చూపించాడు కూడా.

 

ఐదో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్‌(11), రషీద్‌ (4) ఉన్నారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 1-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

loader