మెల్బోర్న్: మెల్బోర్న్ లో జరిగిన మూడో టెస్టు మ్యాచులో భారత్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. బుమ్రా దెబ్బకు ఆస్ట్రేలియా చిత్తయింది. ఈ మ్యాచులో బుమ్రా 9 వికెట్లు తీసుకుని ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. ఆస్ట్రేలియా 137 పరుగుల తేడాతో భారత్ పై ఓటమి పాలైంది.

ఈ విజయంతో 4 టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ ఆస్ట్రేలియా 2-1 తేడాతో ముందంజలో ఉంది. వర్షం కారణంగా ఆదివారం ఐదో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. 8 వికెట్ల నష్టానికి 258 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆ తర్వాత కొద్ది సేపటికే చేతులెత్తేసింది. 261 పరులకు ఆలవుట్ అయింది.

భారత విజయాన్ని ఆలస్యం చేసిన కమిన్స్ ఐదో రోజు త్వరగా అవుటయ్యాడు. 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లియోన్ ను ఇషాంత్ శర్మ పెవిలియన్ పంపించడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

భారత బౌలర్లలో బుమ్రా, జడేజా మూడేసి వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, షమీ రెండేసి వికెట్లు తీశారు. 

భారత్ తొలి ఇన్నింగ్సును ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, రెండో ఇన్నింగ్సును 8 వికెట్ల నష్టానికి 106 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సులో 151 పరుగులకు, రెండో ఇన్నింగ్సులో 261 పరుగులకు ఆలవుట్ అయింది. 

సంబంధిత వార్తలు

మెల్‌బోర్న్ టెస్ట్: భారత్ ఆశలపై నీళ్లు చల్లిన కమిన్స్

రిషబ్ పంత్ కు ఆసిస్ కెప్టెన్ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల

ఆసిస్ కెప్టెన్ కి రోహిత్ శర్మ బంపర్ ఆఫర్

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ