మెల్‌బోర్న్‌:  ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత బ్యాట్స్ మెన్ చతికలపడ్డారు. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. మయాంక్ 28 పరుగులతో, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కమిన్స్ భారత బౌలర్ల పాలిట శాపంగా మారాడు. నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

అస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో భారత్ త్వరత్వరగా వికెట్లను జార విడుచుకుంటోంది. రోహిత్ శర్మ కూడా అస్ట్రేలియా బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. ఐదు పరుగులు మాత్రమే చేసి హాజిల్ వుడ్ బౌలింగులో అవుటయ్యాడు. దాంతో భారత్ 44 పరుగులకే ఐదు వికెట్లను జారవిడుచుకుంది.

భారత్ 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్సును 151 పరుగుల వద్ద ముగించిన తర్వాత మూడో రోజు శుక్రవారం భారత్ రెండో ఇన్నింగ్సును ప్రారంభించింది.

భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ మంచి ఆరంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఛతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టారు. 

హనుమ విహారి 45 బంతుల్లో 13 పరుగులు చేసి కమిన్స్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత పుజారా, కోహ్లీలను కూడా అతనే పెవిలియన్ కు చేర్చాడు. తదుపరి బ్యాటింగ్ కు దిగిన రహానే ఒక్క పరుగు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగులోనే అవుటయ్యాడు. వచ్చినవారు వచ్చినట్లు పెవిలియన్ దారి పడుతుంటే మయాంక్ అగర్వాల్ ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయాడు. 

సంబంధిత వార్తలు

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ