ఆస్ట్రేలియా టీం కెప్టెన్ టిమ్ పైన్ కి, రోహిత్ శర్మకి మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇటీవల టిమ్.. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నఅరోన్ ఫించ్‌తో పరోక్షంగా ‘నువ్వు ఇప్పుడు సిక్స్‌ కొడితే.. నేను ముంబైకి మారిపోతా’ అంటూ కవ్వించాడు. కాగా.. ఆ కవ్వింపు చర్యలపై రోహిత్ తాజాగా స్పందించాడు. అంతేకాదు.. టిమ్ కి బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు.

మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు టిమ్ కామెంట్స్ పై రోహిత్ స్పందించాడు.  ‘నేను పైన్‌ మాటలు విన్నా. కానీ పట్టించుకోలేదు. కేవలం నా బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి సారించాను. కానీ అదే సమయంలో నేను రహానేతో సరదాగా మచ్చటించాను. పైన్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మా ముంబై బాస్‌ను ఒప్పించి మరీ కొనుగోలు చేస్తాం. అతన్ని చూస్తే ముంబై అభిమానిలా ఉన్నాడు.’ అని రహానేతో చెప్పానని రోహిత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని సంబంధిత వార్తలు

మెల్బోర్న్ టెస్ట్: ముగిసిన 3వ రోజు ఆట, భారత్ విలవిల

మెల్బోర్న్ టెస్టు: బుమ్రా దెబ్బకు "కంగారె"త్తారు

మెల్బోర్న్ టెస్టు: 435 పరుగుల వెనుకంజలో కంగారూలు

కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

ద్రవిడ్ రికార్డ్ ని కొల్లగొట్టిన కోహ్లీ