నాలుగో రోజే టెస్టు మ్యాచును ముగించాలని భావించిన భారత జట్టు అశలపై ఆస్ట్రేలియా క్రికెటర్ కమిన్స్ నీళ్లు చల్లాడు. బంతితో రాణించిన కమిన్స్ బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. మెల్బోర్న్ లో భారత్ పై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో ఆస్ట్రేలియా శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. భారత్ స్కోరుకు ఆసీస్ 141 పరుగుల దూరంలో ఉంది. భారత్ విజయానికి మరో రెండు వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్సులో కమిన్స్ 61 పరుగులతోనూ నాథన్ లియోన్ 6 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్సులో భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు తీసుకోగా, షమీ, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఇషాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది.

మెల్బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో భారత బౌలర్లు రాణిస్తూ వచ్చారు..భారత్ విజయానికి చేరువ అవుతోంది. 215 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. స్టార్క్ 18 పరుగులు చేసి షమీ బౌలింగులో అవుటయ్యాడు.

ఆస్ట్రేలియా ఓటమి బాట పట్టింది. 176 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. పైన్ 26 పరుగులు చేసి జడేజా బౌలింగులో పంత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

157 పరుగులకు ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. మార్ష్ 10 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగులో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు ఎస్ఈ మార్ష్ 44 పరుగులు చేసి బుమ్రాకు దొరికిపోయాడు.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో మెల్‌‌బోర్న్‌లో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న షాన్ మార్ష్.. బుమ్రా బౌలింగ్‌లో 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ముందు తడబడుతోంది.

63 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆరోన్ ఫించ్ (3), హరీస్ (13) త్వరత్వరగా అవుటయ్యారు. ఆ తర్వాత ఖవాజా 33 పరుగులు చేసి షమీ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు.అంతకు ముందు 5 వికెట్ల నష్టానికి 54 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ మరో మూడు వికెట్లు కోల్పోయింది. 

ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్ వెంట వెంటనే అవుటయ్యారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 42, రిషబ్ పంత్ 33 పరుగులతో రాణించినప్పటికి ఎక్కువసేపు ఆకట్టుకోలేకపోయారు. దీంతో 38వ ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

దీంతో ఆసీస్ ముందు భారత్ 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యచేధనలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ను బుమ్రా తొలి ఓవర్‌లోనే దెబ్బ తీశాడు. ఓపెనర్ ఫించ్ 3 పరుగుల వద్ద నిష్క్రమించగా.. ఆ తర్వాత హారిస్ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 33.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. ట్రేవిస్ హెడ్ 21, మిచెల్ మార్ష్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.