ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్‌ ఎంత రసవత్తరంగా సాగుతుందో...అంతకంటే రసవత్తరంగా ఆటగాళ్ల మాటల యుద్దం కొనసాగుతోంది. మెల్ బోర్న్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేక పోయిన ఆసిస్ ఆటగాళ్లు మాటలతో(స్లెడ్జింగ్) భారత బ్యాట్ మెన్స్ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారత ఆసిస్ కెప్టెన్, వికెట్ కీఫర్ టిమ్ ఫైన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి.

ఈ మ్యాచ్ మొదటి ఇన్సింగ్స్ లో రోహిత్ శర్మపై కవ్వింపు చర్యలకు దిగిన ఫైన్ రెండో ఇన్సింగ్స్ లో యువ ఆటగాడు రిషబ్ పంత్ ని మాటలతో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. సెంటిమెంటల్ గా మాట్లాడుతూ పంత్ ఏకాగ్రతను దెబ్బతీసేలా ఫైన్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్స్ లో రికార్డై వివాదానికి దారితీస్తున్నాయి. 

పంత్ బ్యాంటింగ్ చేస్తున్న సమయంలో ఫైన్ అతడికి  దగ్గరగా వచ్చి ఇలా మాట్లాడాడు. '' పంత్...ధోనీ వచ్చేశాడు కదా..ఇక నీ పరిస్థితి ఏంటి'' అంటూ వ్యాఖ్యానించాడు.  అంతేకాకుండా మరో ఆపర్ కూడా ఇచ్చాడు. ''ఎలాగూ వన్డే జట్టులో నీకు అవకాశం రాదు కాబట్టి బీబీఎల్ లో హరికేన్స్ జట్టు తరపున ఆడతావా?'' అంటూ పంత్ ని ప్రశ్నించాడు. 

అయితే ఫైన్ ఎంత రెచ్చగొడుతున్నా రిషబ్ పంత్ మాత్రం స్పందించలేదు. ఎప్పటిలాగే ఏకాగ్రతతో తన బ్యాటింగ్ కొనసాగించాడు.  భారత అభిమానులు మాత్రం ఫైన్ వ్యవహారం శైలిపై విమర్శల  వర్షం  కురిపిస్తున్నారు.    

ఈ పర్యటనలో తొలి టెస్ట్‌ నుంచే ఆసిస్ ఆటగాళ్లు మాటలతో  టీంఇండియా ప్లేయర్స్ ని రెచ్చగొడుతూ వస్తున్నారు. నోటికెంత వస్తే అంత మాట్లాడుతూ ఆటగాళ్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. మెల్ బోర్న్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో రోహిత్‌ సిక్స్‌ కొడితే ముంబై జట్టుకు మారిపోతానంటూ పైన్‌ రెచ్చగొట్టాడు. తాజాగా ఇప్పుడు వికెట్‌ కీపర్‌ పంత్‌ను టార్గెట్‌ చేస్తూ నోరుపారేసుకున్నాడు.