కొట్టు, చూద్దాం: రోహిత్ శర్మను రెచ్చగొట్టిన పైన్ (చూడండి)

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచులో రెండో రోజు గురువారం ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుండడంతో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ నిస్పృహకు గురైనట్లు కనిపించాడు. 

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నాథన్ లైన్ బౌలింగులో భారత బ్యాట్స్ మన్ రోహిత్ శర్మను పైన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సిక్స్ కొడుతావా, కొట్టు చూద్దామంటూ రెచ్చగొట్టాడు. బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మను అవుట్ చేయడానికి అవసరమైన ప్లాన్ కోసం పైన్ ఆరోన్ ఫించ్ తో మాట్లాడుతూ వచ్చాడు. 

ఎంసిజీలో రోహిత్ శర్మ సిక్స్ కొడితే తాను ఐపిఎల్ లో తాను ముంబై ఇండియన్స్ కు మద్దతు ఇస్తానని పైన్ ఫించ్ తో చెప్పాడు. రెండు ఓవర్ల పాటు పైన్ ఆ విధంగా రోహిత్ శర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే, రోహిత్ శర్మ ఏ మాత్రం తొణకకుండా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు.

Related Video