జనవరి 1 రోజే ఎందుకు న్యూ ఇయర్ చేసుకుంటారు..?

ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్లాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు. 

why people celebrating new year on jan1st?

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

why people celebrating new year on jan1st?

జనవరి ఒకటవ తేది రోజు  "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు. ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ  వేరే విషయం. ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. 

క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది. ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆ ప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.

ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్లాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. 

ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. అయితే కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరిని ఒకటవ నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడు. 

ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్‌, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యా లు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు. 

భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాశాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరంలో ఏ నెలలో ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో వారం వర్జ్యముతో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది. ప్రకృతికి అనుగుణంగా వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. ( కొన్నిచోట్ల వసంత ఋతువు మేషరాశిలో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు. ) 
ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరంను ఫాలో అవడం కంటే ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరంను ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios