ఉపనిషత్తులు వాటి వేద మూలాలు

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి

The Upanishads have their Vedic origins

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు. ప్రతి వేదంలోను నాలుగు భాగాలున్నాయి. అవి సంహితలు - మంత్ర భాగం, స్తోత్రాలు, ఆవాహనలు బ్రాహ్మణాలు - సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు. అరణ్యకాలు - వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి.

ఉపనిషత్తులు - ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదహరించారు.

ఉప +ని + షత్
ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట ఉపనిషత్తులు జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంధాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం. ప్రకృతి రహస్యాలు మొదలైన వాటి గురించి ఇవి చర్చించాయి. వేదకాలం నాటి ఆలోచన ధోరణికి ఉపనిషత్తులు పరిపూర్ణతను కలిగించాయి. సరైన జ్ఞానానికి, సన్మార్గానికి ఇవి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాయి. 

ఉపనిషత్తులు 108 వరకు ఉన్నా అందులో 10 అతి ముఖ్యమైనవి. వేద సాహిత్యం అంతిమ దశలో ఆవర్భవించాయి కాబట్టి వీటిని 'వేదాంతాలు ' అని కూడా అంటారు. ఋగ్వేదయుగాన్ని తొలివేదయుగమని పిలుస్తారు. మిగిలిన సాహిత్యం-వేదాలు, బ్రహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు వెలువడిన యుగాన్ని మలివేద యుగమని అంటారు. తొలి వేదాయుగానికి, మలివేదయుగానికి మధ్య ఎన్నో మార్పులు సంభవించాయి.

ఉపనిషత్తులు వేదసారమనీ, వేదరహస్యమనీ వర్ణనలు ఉన్నాయి. ఒకప్పుడు వెయ్యిన్నీ ఎనిమిది ఉపనిషత్తులు ఉండేవనీ, ఇప్పుడు నూట ఎనిమిది మాత్రం లభ్యమవుతున్నాయనీ అంటారు. అందులోనూ పది మాత్రం ముఖ్యమైనవనీ, వాటికి మాత్రమే శంకరులు భాష్యం వ్రాశారనీ అంటారు. అవి: 1. ఈశోపనిషత్తు, 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నో పనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూ క్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోప నిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు.

108 ఉపనిషత్తులు -ఉపనిషత్తు పేరు    -    వేదం

1. ఈశావాస్య ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
2. కేన ఉపనిషత్తు  సామవేదం 
3. కఠ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
4. ప్రశ్న ఉపనిషత్తు  అధర్వణవేదం  
5. ముండక ఉపనిషత్తు  అధర్వణవేదం  
6. మాండూక్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
7. తైత్తిరీయ  ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
8. ఐతరేయ ఉపనిషత్తు  ఋగ్వేదం 
9. ఛాందోగ్య ఉపనిషత్తు  సామవేదం 
10. బృహదారణ్యక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
11. బ్రహ్మ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
12. కైవల్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
13. జాబాల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
14. శ్వేతాశ్వతర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
15. హంస ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
16. ఆరుణిక ఉపనిషత్తు  సామవేదం 
17. గర్భ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
18. నారాయణ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
19. పరమహంస ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
20. అమృతబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
21. అమృతనాద ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
22. అధర్వశిర ఉపనిషత్తు  అధర్వణవేదం  
23. అధర్వశిఖ ఉపనిషత్తు  అధర్వణవేదం  
24. మైత్రాయణి ఉపనిషత్తు  సామవేదం 
25. కౌషీతకీబ్రాహ్మణ ఉపనిషత్తు  ఋగ్వేదం 
26. బృహత్ జాబాల ఉపనిషత్తు  అధర్వణవేదం  
27. నృసింహతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం  
28. కాలాగ్నిరుద్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
29. మైత్రేయ ఉపనిషత్తు  సామవేదం 
30. సుబాల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
31. క్షురిక ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
32. మంత్రిక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
33. సర్వసార ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
34. నిరాలంబ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
35. శుకరహస్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
36. వజ్రసూచిక ఉపనిషత్తు  సామవేదం 
37. తెజోబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
38. నాదబిందు ఉపనిషత్తు  ఋగ్వేదం 
39.  ధ్యానబిందు ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
40. బ్రహ్మవిద్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
41. యోగతత్త్వ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
42. ఆత్మబోధ ఉపనిషత్తు  ఋగ్వేదం 
43. నారదపరివ్రాజక ఉపనిషత్తు  అధర్వణవేదం  
44. త్రిశిఖబ్రాహ్మణ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
45. సీత ఉపనిషత్తు  అధర్వణవేదం  
46. యోగచూడామణి ఉపనిషత్తు  సామవేదం 
47. నిర్వాణ ఉపనిషత్తు  ఋగ్వేదం 
48. మండలబ్రాహ్మణ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
49. దక్షిణామూర్తి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
50. శరభ ఉపనిషత్తు  అధర్వణవేదం  
51. స్కంద ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
52. త్రిపాద్విభూతిమహానారాయణ ఉపనిషత్తు  అధర్వణవేదం  
53. అద్వయతారక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
54. రామరహస్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
55. రామతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం  
56. వాసుదేవ ఉపనిషత్తు  సామవేదం 
57. ముద్గల ఉపనిషత్తు  ఋగ్వేదం 
58. శాండిల్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
59. పైంగల ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
60. భిక్షుక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
61. మహా ఉపనిషత్తు  సామవేదం 
62. శారీరక ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
63. యోగశిఖ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
64. తురీయాతీత ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
65. సన్యాస ఉపనిషత్తు  సామవేదం 
66. పరమహంస పరివ్రాజక ఉపనిషత్తు  అధర్వణవేదం  
67. అక్షమాలిక ఉపనిషత్తు  ఋగ్వేదం 
68. అవ్యక్త ఉపనిషత్తు  సామవేదం 
69. అన్నపూర్ణ ఉపనిషత్తు  అధర్వణవేదం  
70. ఏకాక్షర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
71. సూర్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
72. అక్షి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
73. అధ్యాత్మ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
74. కుండిక ఉపనిషత్తు  సామవేదం 
75. సావిత్రి ఉపనిషత్తు  సామవేదం 
76. ఆత్మ ఉపనిషత్తు  అధర్వణవేదం  
77. పాశుపతబ్రహ్మ ఉపనిషత్తు  అధర్వణవేదం  
78. పరబ్రహ్మ ఉపనిషత్తు  అధర్వణవేదం  
79. అవధూత ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
80. త్రిపురాతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం  
81. దేవి ఉపనిషత్తు  అధర్వణవేదం  
82. త్రిపుర ఉపనిషత్తు  ఋగ్వేదం 
83. కఠరుద్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
84. భావన ఉపనిషత్తు  అధర్వణవేదం  
85. రుద్రహృదయ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
86. యోగకుండలి ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
87. బస్మజాబాల ఉపనిషత్తు  అధర్వణవేదం  
88. రుద్రాక్షజాబాల ఉపనిషత్తు  సామవేదం 
89. గణపతి ఉపనిషత్తు  అధర్వణవేదం  
90. దర్శన ఉపనిషత్తు  సామవేదం 
91. తారసార ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
92. మహావాక్య ఉపనిషత్తు  అధర్వణవేదం  
93. పంచబ్రహ్మ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
94. ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
95. గోపాలతాపిని ఉపనిషత్తు  అధర్వణవేదం  
96. కృష్ణ ఉపనిషత్తు  అధర్వణవేదం  
97. యాజ్ఞవల్క ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
98. వరాహ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
99. శాట్యాయనీయ ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం 
100. హయగ్రీవ ఉపనిషత్తు  అధర్వణవేదం  
101. దత్తాత్రేయ ఉపనిషత్తు  అధర్వణవేదం  
102. గారుడ ఉపనిషత్తు  అధర్వణవేదం  
103. కలిసంతరణ ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
104. జాబాలి ఉపనిషత్తు  సామవేదం 
105. సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తు  ఋగ్వేదం 
106. సరస్వతీరహస్య ఉపనిషత్తు  కృష్ణయజుర్వేదం 
107. బహ్వృచ ఉపనిషత్తు ఋగ్వేదం 
108. ముక్తిక ఉపనిషత్తు  శుక్లయజుర్వేదం

ఉపనిషత్తుల కాలంలో విద్యావ్యవస్థ:- దీనిని మనం క్రీస్తు పూర్వం 1400 నుండి క్రీస్తు పూర్వం 600 వరకూ గల కాలముగా చెప్పుకొనవచ్చు. ఈ కాలంలోనే బ్రాహ్మణములు, ఆర్యణకములు, ఉపనిషత్తులు వృద్ధిచేయబడినాయి. వేదములవలె ఉపనిషత్తులు కూడా శ్రుతులుగా అందించబడినవి. అనగా గురు ముఖతః శిష్యుడు విని నేర్చుకున్నవి. ఆనాడు వేదాంతమును ఉపదేశించే అశ్రమాలకు (పాఠశాలలకు) ప్రధానమైన అంశాలు 1. ఉపనిషత్తులు, 2. భగవద్గీత, 3. బ్రహ్మ సూత్రములు.
ఉపనిషత్తులలో జీవాత్మ, బ్రహ్మముల భావనను విచారించడం జరిగింది. ఇవి ప్రధానంగా రెండు రకాల సిద్ధాంతాలకు దారితీశాయి. అవి అద్వైతం అనగా జీవాత్మ, పరబ్రహ్మములు వేర్వేరుగా లేవని అవి రెండూ ఒక్కటేనను భావన. రెండవది ద్వైతం. అనగా జీవాత్మ వేరు బ్రహ్మము వేరు. బ్రహ్మము సర్వ స్వతంత్రుడు, కర్త. జీవాత్మ నిమిత్త మాతృడు.

భారతదేశంలోని వివిధ వేదాంత పాఠశాలలు ఈ సిద్ధాంతాలనే బోధించాయి. అందు ప్రముఖంగా అద్వైతమును శంకరాచార్యుడు, ద్వైతమును మధ్వాచార్యుడు తమ తమ వేదాంత పాఠశాలలో బోధించి ఆయా సిద్ధాంతాంలను ప్రచారం చేశారు. అలాగే మరికొన్ని సిద్ధాంతాలైన విశిష్టాద్వైతమును రామానుజుడు, ద్వైతాద్వైతమును నింబార్కుడు, శుద్ధాద్వైతమును వల్లభుడు తమ వేదాంత పాఠశాలలో బోధించి ప్రచారం చేసారు.

కొత్త ఉపనిషత్తులు:- పైన 108 ఉపనిషత్తులని తెలిపినప్పటికీ కొత్త ఉపనిషత్తుల రచన జరుగుతూనే ఉంది. ఎవరైనా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు, అప్పటికే ఉన్న ఉపనిషత్తులు కొత్త సిద్ధాంతంతో విభేదించిన సందర్భాలలో సిద్ధాంతకర్తలే స్వయంగా మరో ఉపనిషత్తును రచించడం జరిగింది. అలాంటి కొన్ని ఉపనిషత్తులను 1908 వ సంవత్సరములో డా. ఫ్రెడ్రిక్ ష్రేడర్ అనే జర్మన్ భాషా శాస్త్రవేత్త కనుగొన్నాడు. అవి:- బష్కళ, ఛాగలేయ, ఆర్షేయ, శౌనక ఉపనిషత్తులు.
కొత్త ఉపనిషత్తులు ముఖ్య ఉపనిషత్తుల్లోని అనుకరణలు అయి ఉండాలి అని వాదన ఉంది. ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి ఆంగ్ల అనువాదాన్ని హెన్రీ థామస్ కొలెబ్రూక్ 1805 లో రచించడం జరిగింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios