మానవులకు 'గుణ' పాఠం
ధర్మంచ అంటే ధర్మం ఆచరించమని ఒక వైపు చెబుతారు, మరి ఇంకో వైపు నుంచి ''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అంటే అన్ని ధర్మాలు విడిచి పెట్టి దేవుని శరణు పొందమని చెబుతారు.
"జీవితంలో ప్రతి బాధ మనకు ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం మనం మారేందుకు బంగారు బాట అవుతుంది."
"ఒకరికి మన గర్వం చూపెట్టడానికి బదులు గౌరవించడానికి ప్రయత్నిస్తే మన గౌరవం కూడ పెరుగుతుంది."
అందరూ ధర్మం, ధర్మం అంటారు కదా! అసలు ధర్మం అంటే ఏమిటి???
ధర్మంచ అంటే ధర్మం ఆచరించమని ఒక వైపు చెబుతారు, మరి ఇంకో వైపు నుంచి ''సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ" అంటే అన్ని ధర్మాలు విడిచి పెట్టి దేవుని శరణు పొందమని చెబుతారు.
ఇది ఎలా???
పైకి ఈ రెండూ పరస్పర వాస్తవ విరుద్ధంగా కనిపించినా.... ఈ విషయం వాక్యాల మధ్య ధర్మం అంటే ఏమిటో మనం ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.
ధర్మాన్ని పరిత్యజించి, దేవుని శరణు పొందాలంటే ఏమీ చేయాలి?
ఈ రెండు సమస్యల గురించి కొంత వరకు ధర్మం అనే శబ్దానికి ఉత్పత్తి అర్థం తీసుకుంటే " ధరతీతి ధర్మ" అంటే ప్రపంచాన్ని ధరించేది ధర్మం!!!
సృష్టి అంతటికీ, అందులో ముఖ్యంగా మానవునికి ఆధారమైనది ధర్మం...
మనకి కళ్ళకి కనబడేది భూమి, మన అందరినీ ధరించి ఉంది కాబట్టి భూమిని ధరణి అన్నారు.
భూమి మనకి ఆధారమై ఉన్నట్లుగా, ధర్మం భూమికి కూడా ఆధారమై ఉంది కాబట్టి " ధరతీతి ధర్మ" అన్నారు.
ఈ ధర్మానికి ఆచరణలో దాని స్వభావం ఏంటి ?
"అభ్యుదయకి శ్రేయసకరః స్వధరః " అంటే సర్వజీవులకి, సర్వ మానవాళికి కూడా అభ్యుదయం, శ్రేయస్సు అంటే అమితమైన మంచి అయినది, చెడు లేకుండా ఉండేది ధర్మం.
అందుకే ఎవరినీ హింసించడం కానీ, మనస్సు నొప్పించడం, వ్యక్తి చాటుగా ఉన్నప్పుడు అతని గురించి తప్పుగా ప్రచారం చేయడం, హేళన చేయకుండా ఉండడమే ధర్మం అని పెద్దలు అన్నారు, శాస్త్రాలు చెబుతున్నాయి.
ధర్మాన్ని ఆచరిస్తే అదే మనలను కాపాడుతుంది అని అర్థం, ఎవరిపై మనసులోనైనా చెడు తలపెట్టకుండా ఉంటూ... నిరంతరం దైవ నామ స్మరణ చేస్తూ అందరిలో దైవాన్ని చూస్తూ జీవించడమే మన ధర్మం... జై శ్రీమన్నారాయణ
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151