నేడు భౌమాశ్విని యోగం.. మహా మృత్యువును తరమవచ్చు..!!
మన జ్యోతిష్య సాంప్రదాయంలో ఏ రోజైతే మంగళవారం రోజు అశ్విని నక్షత్రం ఉంటుందో ఆరోజును భౌమవారం అంటే మంగళవారం. అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారంను భౌమాశ్విని యోగం అంటారు. ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం
మన జ్యోతిష్య సాంప్రదాయంలో ఏ రోజైతే మంగళవారం రోజు అశ్విని నక్షత్రం ఉంటుందో ఆరోజును భౌమవారం అంటే మంగళవారం. అశ్విని నక్షత్రంతో కూడిన మంగళవారంను భౌమాశ్విని యోగం అంటారు.
ఇది అరుదుగా లభ్యమయ్యే యోగం. ఈ రోజు దేవీ అధర్వశీర్షం ప్రకారం దేవీమంత్రపారాయణ చేయడం ద్వారా మహామృత్యువును కూడా తరమవచ్చు అనేది ఆర్యోక్తి!. అమ్మవారి కి ఇష్టమైన నవమి తిధితో కలసి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
భౌమాశ్విన్యాం మహాదేవీసన్నిధౌ జప్త్వా మహామృత్యుం తరతి !
స మహామృత్యుం తరతి ! య ఏవం వేద ! ఇత్యుపనిషత్!
భౌమాశ్విని పర్వదినం నాడు అనగా 14 జులై 2020 మంగళవారం, నవమి తిథి, అశ్విని నక్షత్రం నాడు అమ్మవారి అనుగ్రహం కోసం సర్వులూ శంకరులు కైలాసం నుండి తెచ్చిన మంత్రరూపమైన స్తోత్రం సౌందర్యలహరి, లలితా సహస్ర నామ పారాయణం, మహాభారత విరాట పర్వంలోని అమ్మవారి స్తోత్ర పారాయణం, సప్తశ్లోకి పారాయణం, దుర్గా చంద్రకళా స్తుతి పారాయణం, అచ్యుతానంతగోవింద ( అచ్యుత, అనంత, గోవింద ) అనే నామ జపం, మన్యుసూక్త పారాయణ, సుబ్రహ్మణ్య స్వామి మాలమంత్ర జపం ఇలా ఏది వీలు అయితే అది వారి శక్త్యానుసారం చేసుకోవచ్చు.
చండీ జపం, హోమం ఇంట్లోకానీ, గుడిలోకాని ప్రజలు ఎక్కువ గుమిగూడకుండా, ప్రజా క్షేమం కోరి నిర్వహించిన కూడా మంచిదే! ఈ భౌమాశ్వని పర్వకాలంలో చేసే అనుష్ఠానానికి మన నిత్య అనుష్ఠానానికన్నా ఎక్కువ ఫలితాలుంటాయి.
యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా!నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః !!
రోగానశేషా నపహంసి తుష్టారుష్టాతుకామాన్ సకలాబభీష్టాన్!
త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యా శ్రయతాం ప్రయాంతి !!
స్వర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి!
ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం !!
ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో పరాశక్తి అనుగ్రహంచేత మహాశక్తిమంతులుగా మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన – ప్రయత్నం రెండూ చేసుకోవాలి. భక్తీ, శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి తప్పక దైవానుగ్రహం కలుగుతుంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్
జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151