ఆయుర్వేద సుభాషిత రత్నాలు

శరీర మర్దన వలన శరీర రక్తశుద్ది కలిగి సర్వదేహమునకు కాంతి కలుగును. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మామూలు నువ్వులనూనెతో మర్దన చేయవచ్చు . రోగావస్థలో ఉన్నప్పుడు నారాయణ , ప్రసారిణి , విషగర్భాది తైలమర్దన శ్రేయస్కరం.

Ayurvedic Medicine to Improve  Health & Wellbeing

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151.

Ayurvedic Medicine to Improve  Health & Wellbeing

 భూమిని ఆశ్రయించి పుట్టిన ప్రజలు అన్నము నుండి పుట్టుచున్నారు. అన్నము అన్ని భూతముల కంటే జైష్ట్యమైనది . ఇందువలన అన్నం సర్వఔషధం అని చెప్పబడుతుంది.

 పసుపు మున్నగు వానితో శరీరం రుద్దుకొనుట వల్ల దురద తగ్గును . శరీరం రంగు పెరుగును . శరీర కాఠిన్యం తగ్గును. నూనెతో శరీరం రుద్దుకొనుట వలన దురద తగ్గును మరియు చర్మదోషం తగ్గును.

శరీర మర్దన వలన శరీర రక్తశుద్ది కలిగి సర్వదేహమునకు కాంతి కలుగును. ఆరోగ్యముగా ఉన్నప్పుడు మామూలు నువ్వులనూనెతో మర్దన చేయవచ్చు . రోగావస్థలో ఉన్నప్పుడు నారాయణ , ప్రసారిణి , విషగర్భాది తైలమర్దన శ్రేయస్కరం.

 విశ్రాంతిగా పడుకోవడం వలన పిత్త రోగము నశించును. మర్దన పద్దతి వలన వాతరోగం తగ్గును. వాంతుల వలన కఫదోషం తగ్గును.

 దేహము నందు ఏర్పడు అనేక వ్యాధులకు లంఘనం ( ఉపవాసం ) పరమ ఔషధము . లంఘనం అనగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేయుట . ముఖ్యముగా జ్వరం , అజీర్ణారోగాదుల యందు ముఖ్యచికిత్స లంఘనము .

జలవస్తి కర్మని అభ్యసించినచో రసరక్తాధి ధాతువులు , శ్రవణేంద్రియములు , మనస్సు ప్రసన్నత నొందును. శరీరకాంతి పెరుగును . జఠరాగ్ని పెరుగును . సకలరోగములు నశించును. జలవస్తి క్రియ నీటియందే వేయవలెను . శుష్కవస్తి క్రియ భూమి మీద మాత్రమే వేయవలెను .

సూర్యుడు ఆకాశం నందు ఉండి భూమియందలి రసములను ( నీటిని ) పీల్చునట్లు వస్తి క్రియ చేయడం వలన జీర్ణాశయం నుండి , శిరము నుండి పాదాల వరకు వ్యాపించి ఉన్న సర్వదోషములను శరీరం నుండి బయటకి పంపును.

ఘృతము , సైన్ధవ లవణము , ఇంగువతో కలిసియున్న మజ్జిగను నిత్యము తాగుచున్న సర్వరోగములను హరించును . 

వాతరోగమున పులిసిన మజ్జిగని ఉప్పు కలిపి త్రాగిన , పిత్తరోగము నందు తీయగా ఉండు మజ్జిగని చక్కర కలిపి తాగవలెను . కఫదోషము నందు శొంఠి , పిప్పలి , మిరియాల చూర్ణం , ఉప్పు కలిపిన మజ్జిగ సేవించవలెను .

వేసవికాలం నందు బెల్లము మరియు కరక్కాయ సమాన భాగముగా  , వర్షాకాలం నందు సైన్ధవ లవణముతో , శరత్కాలం నందు చక్కెరతో కలిపినదానిని , చలికాలము శొంఠిపొడితో , శిశిర ఋతువు నందు పిప్పలితో కూడి , వసంతమున తేనెతో కలిపి కరక్కాయ సమాన భాగములుగా సేవించుచున్న రోగములు అన్నియు నశించును.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios