ఈ కాలం పిల్లలు జంక్ ఫుడ్ తిన్నంత ఇష్టంగా హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడటం లేదు. అయినా వారికి హెల్దీ ఫుడ్ ఇవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ బెటరో తెలుసుకుందామా…
సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి. స్కూల్స్ తిరిగి మళ్లీ ఓపెన్ అయ్యాయి. రెండు నెలల పాటు పిల్లల అల్లరిని భరించిన పేరెంట్స్ కి.. స్కూల్ తెరవడం కాస్త ఉపశమనం గానే ఉంటుంది. కానీ, ఉదయాన్నే లేచి లంచ్ బాక్సులు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు.. మధ్యలో వారికి బెస్ట్ స్నాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాలం పిల్లలు జంక్ ఫుడ్ తిన్నంత ఇష్టంగా హెల్దీ ఫుడ్ తినడానికి ఇష్టపడటం లేదు. మరి, అలాంటి పిల్లలకు ఆరోగ్యకరంగా, వారికి నచ్చేలా ఎలాంటి ఫుడ్స్ వారి స్నాక్స్, లంచ్ బాక్స్ లో చేర్చాలో ఇప్పుడు చూద్దాం...
పిల్లల కోసం ఆరోగ్యకరమైన టిఫిన్ బాక్స్ స్నాక్స్
1. వెజిటేబుల్ ఉప్మా..
ఉప్మా అంటే ఈ కాలం పిల్లలు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. కానీ దానిని మనం సింపుల్ గా, రుచిగా, హెల్దీగా చేస్తే కచ్చితంగా తింటారు. ఉప్మాలో ఏ కూరగాయ అయినా వేసుకోవచ్చు. మీ పిల్లలు ఇష్టంగా తినే కూరగాయలు అన్నింటినీ ఇందులో కలిపి పెట్టండి. చివర్లో నెయ్యి వడ్డిస్తే రుచి కమ్మగా ఉంటుంది. క్యారెట్, బీన్స్, బఠానీ వేస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలకు అవసరం అయ్యే విటమిన్లు, మినరల్స్ కూడా అందుతాయి.
2. మినప్పప్పు పరాటా
ప్రొటీన్స్ ఎక్కువగా ఉండే మినప్పప్పు మిశ్రమాన్ని పరాటాలో నింపి వేసి పిల్లలకు ఇస్తే, అది తిన్న తర్వాత వాళ్లకు తృప్తిగా ఉంటుంది. మంచి ఉల్లిపాయ తురుము, కరివేపాకు వేసి రుచిగా చేయవచ్చు.
3. ఫ్రూట్ సలాడ్
ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లను చిన్న ముక్కలుగా కోసి తేనెతో కలిపి ఇచ్చినప్పుడు అది పిల్లలకి ఇష్టపడే హెల్దీ స్నాక్
అవుతుంది.
4. మొలకెత్తిన శనగల చాట్
మొలకెత్తిన శనగలు, ఉల్లిపాయ, టమోటా, నిమ్మరసం, ధనియాలతో కలిపి చిన్న చాట్ లా తయారు చేస్తే పోషకాలు ఎక్కువగా అందుతాయి.
5. మినీ ఇడ్లి + కారం పౌడర్
చిన్న మినీ ఇడ్లీలను నెయ్యితో వేయించి, కొంచెం కారం పొడి లేదా పచ్చడి తోపాటు ఇస్తే పిల్లలు ఆనందంగా తింటారు.
6. అన్నం ఉండలు (Veg Rice Balls)
ఉడికించినఅన్నంలో కూరగాయల మిశ్రమం కలిపి ఉండలుగా తయారుచేసి స్టీమ్ చేసి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది హెల్తీ, చాలా ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది.
7. పీనట్ బటర్ బ్రెడ్
హోల్ వీట్ బ్రెడ్ పై పీనట్ బటర్ కొద్దిగా పలుచగా వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇస్తే, ప్రోటీన్ తో పాటు శక్తి కూడా అందుతుంది.
ఇవి పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన స్నాక్స్. ప్రతి వారం వీటినే మారుస్తూ పెడితే.. పిల్లలు ఇష్టంగా తింటారు..


