MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Kids Health: పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్, తల్లులు తప్పక తెలుసుకోవాలి

Kids Health: పిల్లలకు అస్సలు ఇవ్వకూడని ఫుడ్స్, తల్లులు తప్పక తెలుసుకోవాలి

Kids Health: పిల్లల ఆరోగ్యం అనేది తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్. అది కూడా వాళ్లు ఎదిగే సమయంలో వారికి ఇచ్చే ఆహారం మరీ ముఖ్యం. అది వారి శరీరానికి మాత్రమే కాకుండా బ్రెయిన్ డెవలప్‍మెంట్‍పై ప్రభావం చూపుతుంది. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 07 2026, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురవుతున్న పిల్లలు
Image Credit : Getty

తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురవుతున్న పిల్లలు

ఇప్పుడున్న సమయంలో పిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెరేంట్స్ ఇద్దరూ ఉద్యోగాల్లో హడావిడిగా ఉండటం, బిజీబిజీగా ఉండటం వల్ల....పిల్లలు ఏం తింటున్నారో, టైంకు తింటున్నారో లేదో చూసుకోరు, పట్టించుకోరు. మరికొంతమంది తల్లిదండ్రులు ఏదో ఒకటి పెట్టేస్తుంటారు. రాత్రి మిగిలిపోయిన బిర్యానీలు, త్వరగా అయిపోయే ఇన్‍స్టంట్ మ్యాగీలు, న్యూడుల్స్ ఇచ్చేస్తుంటారు. దానిపిల్లల్లో జీర్ణప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి బయటఫుడు, మసాలాలు, ప్రిజర్వేటివ్స్ తీసుకుంటే అరగదు. వల్ల వాళ్ల ఆరోగ్యం త్వరగా పాడవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
పిల్లలకు హెల్ధీ ఫుడ్స్
Image Credit : Getty

పిల్లలకు హెల్ధీ ఫుడ్స్

పిల్లలైనా, పెద్దలకైనా రకరకాల ఫుడ్ తినాలని ఉంటుంది. ఇంట్లో వెరైటీగా, హెల్దీగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకవేళ అలా జరగకపోతే బయట జంక్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ పదార్థాలకు అలవాటు పడతారు. అవి పిల్లల ఆరోగ్యానికి అసలు మంచివి కావు. అందుకే చిన్న పిల్లలకు ఇవ్వకుండా ఉండాల్సిన కొన్ని ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

38
కూల్‌డ్రింక్స్‌లో షుగర్, గ్యాస్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్
Image Credit : our own

కూల్‌డ్రింక్స్‌లో షుగర్, గ్యాస్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్

ముఖ్యంగా కూల్ డ్రింక్స్. చాలా మంది ఇళ్లల్లో కూల్‍డ్రింక్స్ తెచ్చి పెట్టుకుంటారు. పిల్లలు కూడా వాటికి అలవాటుపడిపోతారు. పొద్దున్నే లేవగానే చాలా మంది పిల్లలు కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ వీటిలో ఎక్కువగా షుగర్, గ్యాస్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవి పిల్లల పళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలు, ఒబెసిటీ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. 

48
చిప్స్ వల్ల బీపీ వచ్చే అవకాశం
Image Credit : Getty

చిప్స్ వల్ల బీపీ వచ్చే అవకాశం

పిల్లలకు ఎక్కువగా ఇష్టమయ్యే స్నాక్స్‌లో చిప్స్ ఒకటి. కానీ చిప్స్‌లో ఎక్కువ మోతాదులో సాల్ట్, ఆయిల్, ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. దీని వల్ల బీపీ సమస్యలు రావచ్చు. అలాగే జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. 

58
కాలేయంపై ప్రతికూల ప్రభావం
Image Credit : Getty

కాలేయంపై ప్రతికూల ప్రభావం

ఇన్‌స్టంట్ ఫుడ్స్, ఇన్‍స్టంట్ నూడుల్స్...ఇవి 5, 10 నిమిషాల్లో తయారైపోతాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఇస్తుంటారు. కానీ వీటిలో ఉండే ప్రిజర్వేటివ్స్, సోడియం, బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల పిల్లల్లో ఒబెసిటీ సమస్య పెరుగుతుంది. అలాగే కాలేయంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

68
చాక్లెట్స్, కేకులు తింటే దంతాల సమస్యలు
Image Credit : Getty

చాక్లెట్స్, కేకులు తింటే దంతాల సమస్యలు

చాక్లెట్స్, క్యాండీస్‌లో అధికంగా షుగర్, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే దంతాల్లో గుల్లలు, దంతాలు పుచ్చిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది.

78
పిజ్జా, బర్గర్‍తో ఒబెసిటీ, లివర్ సమస్యలు
Image Credit : Getty

పిజ్జా, బర్గర్‍తో ఒబెసిటీ, లివర్ సమస్యలు

జంక్ ఫుడ్స్‌ అయిన పిజ్జా, బర్గర్ వంటి వాటిలో ఎక్కువగా సాల్ట్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిలో మైదా, శరీరానికి హాని చేసే కెచప్స్, సాస్‍లు ఉంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు ఇవ్వవు. ఎక్కువగా తింటే ఒబెసిటీ, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

88
ఇంటి భోజనంతో ఆరోగ్యంగా, యాక్టివ్‍గా ఉంటారు
Image Credit : Getty

ఇంటి భోజనంతో ఆరోగ్యంగా, యాక్టివ్‍గా ఉంటారు

పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఇంట్లో తయారుచేసిన భోజనం పెట్టడం చాలా మంచిది. ఫ్రూట్స్, కూరగాయలు, పాలు, గుడ్లు, పప్పులు, గింజలు వంటి పోషకాహారాలు పిల్లల ఆహారంలో ముఖ్యంగా ఉండాలి. దానివల్ల పిల్లల ఆరోగ్యం, మెదడు చురుకుదనం పెరుగుతుంది. గట్ హెల్త్ బాగుంటుంది. యాక్టివ్‍గా ఉంటారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
చిన్నారుల సంరక్షణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Kids Psychology: తండ్రికి భయపడే పిల్లలు.. పెద్దయ్యాక ఎలా తయారౌతారు?
Recommended image2
Kids Health: పిల్లల మెమరీ పవర్ పెంచే 7 సూపర్ ఫుడ్స్ ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved