MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Pregnancy Calculation: పెళ్లై నెల.. కానీ నెలన్నర ప్రెగ్నెన్సీ .. ఇది సాధ్యమేనా?

Pregnancy Calculation: పెళ్లై నెల.. కానీ నెలన్నర ప్రెగ్నెన్సీ .. ఇది సాధ్యమేనా?

పెళ్లి జరిగి నెల రోజులే అవుతోంది. కానీ నెలన్నర ప్రెగ్నెంట్ అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటే ముందే ఏదైనా తప్పు జరిగిందా? అని చాలామంది అనుకుంటారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో? డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Mar 02 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pregnancy Calculation
Image Credit : Getty

Pregnancy Calculation

పెళ్లై ఒక నెలే అయింది… కానీ ప్రెగ్నెన్సీ మాత్రం నెలన్నర ఉందట! ఇదేం విచిత్రం అని చాలామంది అనుకుంటారు. కొందరు అమ్మాయి మీద డౌట్ పడితే, మరికొందరు ఇది ఎలా సాధ్యం?, లెక్కల్లో ఏదైనా తప్పు ఉందా? అని ఆలోచిస్తుంటారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏం లేదు. అదేంటి అనుకుంటున్నారా.. ఆలస్యమెందుకు పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పీరియడ్స్ డేట్ ఆధారంగా..
Image Credit : Getty

పీరియడ్స్ డేట్ ఆధారంగా..

వైద్యుల ప్రకారం, గర్భధారణ లెక్కలు సాధారణంగా పెళ్లి తేదీ లేదా గర్భధారణ జరిగిన రోజు నుంచి కాకుండా, మహిళకు చివరిసారి వచ్చిన పీరియడ్స్ (Last Menstrual Period – LMP) తేదీ నుంచి లెక్కిస్తారు. అంటే గర్భధారణ జరిగిన నిజమైన రోజు కంటే సుమారు రెండు వారాల ముందే లెక్క మొదలవుతుంది. అందువల్ల పెళ్లై నెల రోజులే అయినా, గర్భధారణ లెక్కలో అది నెలన్నరగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Glowing face: 15 రోజులపాటు రాత్రి పడుకునే ముందు ఈ 5 చేసినా చాలు.. మెరిసే ముఖం మీ సొంతం!
Related image2
Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
36
ఎలా లెక్కిస్తారంటే..
Image Credit : Getty

ఎలా లెక్కిస్తారంటే..

ఆరోగ్య నిపుణుల ప్రకారం, మహిళల రుతుచక్రం సగటున 28 రోజులుగా ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజును ‘డే 1’గా తీసుకుంటారు. 14వ రోజున ఓవ్యూలేషన్ జరుగుతుంది. అదే సమయంలో గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గర్భధారణ వయస్సు లెక్కించడం మాత్రం పీరియడ్స్ మొదటి రోజు నుంచే ప్రారంభమవుతుంది.

అందువల్ల ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యే సమయానికి కనీసం నాలుగు నుంచి ఆరు వారాల గర్భధారణగా డాక్టర్లు చెబుతుంటారు. అంటే మహిళకు పీరియడ్స్ ఆగిన రెండు వారాల తర్వాత ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయినా, లెక్కలో అది నెలన్నరగా కనిపించవచ్చు. ఇది వైద్యపరంగా సర్వసాధారణం అని డాక్టర్లు చెబుతున్నారు.

46
ఆ రెండింటికి ముడి పెట్టొద్దు
Image Credit : Getty

ఆ రెండింటికి ముడి పెట్టొద్దు

మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రతి మహిళకు పీరియడ్స్ సైకిల్ ఒకే విధంగా ఉండదు. కొందరికి 21 రోజులకే పీరియడ్స్ వస్తాయి, మరికొందరికి 35 రోజుల వరకు రావు. దానివల్ల కూడా గర్భధారణ లెక్కల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అందుకే వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గర్భధారణ వయసును మరింత కరెక్ట్ గా అంచనా వేస్తారు. ముఖ్యంగా 6 నుంచి 9 వారాల మధ్య చేసే స్కాన్ గర్భధారణ వయసును స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పెళ్లి తేదీకి గర్భధారణ లెక్కను లింక్ చేయడం కరెక్ట్ కాదని డాక్టర్లు సూచిస్తున్నారు.

56
అపోహలు వద్దు
Image Credit : Getty

అపోహలు వద్దు

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో అనవసర అనుమానాలు, అపోహలు కుటుంబాల్లో కలగవచ్చు. కానీ నిపుణుల ప్రకారం గర్భధారణ లెక్కల విధానం గురించి అవగాహన లేకపోవడం వల్లే ఈ సందేహాల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే సరైన వైద్య సలహాలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని సూచిస్తున్నారు.

66
ఆరోగ్యంపై ప్రభావం..
Image Credit : Pinterest

ఆరోగ్యంపై ప్రభావం..

ఆరోగ్య నిపుణుల ప్రకారం మానసిక ఆందోళన గర్భిణీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో సంతోషకరమైన వాతావరణం అవసరం. అనవసర ఒత్తిడిని తగ్గించాలి. లేని పోని అనుమానాలతో వారిని ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు గర్భిణీకి మద్ధతుగా నిలవడం, అపోహలకు తావివ్వకపోవడం మంచిదని చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
మహిళలు
జీవనశైలి
బంధుత్వం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image2
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Recommended image3
Child Psychology: మీ పిల్లల్లో ఈ 5 లక్షణాలు ఉంటే.. మీరు సూపర్ కిడ్‍ని పెంచుతున్నట్లే!
Related Stories
Recommended image1
Glowing face: 15 రోజులపాటు రాత్రి పడుకునే ముందు ఈ 5 చేసినా చాలు.. మెరిసే ముఖం మీ సొంతం!
Recommended image2
Walking: 20 రోజులపాటు రోజుకు 10 నిమిషాలు వాకింగ్ చేస్తే శరీరంలో జరిగే 5 మార్పులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved