MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

Parenting Psychology: పేరెంట్స్ స్ట్రెస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

చాలామంది పేరెంట్స్ వారి స్ట్రెస్ ని పిల్లలపై చూపిస్తుంటారు. నిజానికి పేరెంట్స్ స్ట్రెస్ వారి వ్యక్తిగత సమస్యలా కనిపించినా, అది పిల్లలపై ప్రభావం చూపిస్తుందని చెబుతోంది సైకాలజీ. పెద్దల ఆందోళన, మాట తీరు వంటివి పిల్లలపై ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Feb 18 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Parenting Psychology
Image Credit : ChatGpt AI

Parenting Psychology

సైకాలజీ ప్రకారం ఇంట్లో ఉండే పెద్దవాళ్ల మానసిక స్థితి పిల్లల భావోద్వేగాలపై మంచి, చెడు ప్రభావం చూపిస్తాయి. అధిక ఒత్తిడిలో ఉన్న తల్లిదండ్రులు సాధారణంగా కఠినంగా, అసహనంగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పిల్లల్లో భయం, అస్థిరత, ఆత్మవిశ్వాసం తగ్గడానికి దారి తీస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పెద్దయ్యాక ఎలా మారుతారంటే?
Image Credit : Getty

పెద్దయ్యాక ఎలా మారుతారంటే?

సైకాలజీ ప్రకారం పిల్లలకు భద్రతా భావం చాలా అవసరం. తల్లిదండ్రులు నిరంతరం స్ట్రెస్‌లో ఉంటే, వారు పిల్లలకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వలేరు. దానివల్ల పిల్లల్లో ఇన్ సెక్యూర్ అటాచ్మెంట్ ఏర్పడే ప్రమాదం ఉంది. అలాంటి పిల్లలు పెద్దయ్యాక సంబంధాల్లో అనిశ్చితి, భయంతో ఉంటారు. తల్లిదండ్రుల తాత్కాలిక ఒత్తిడి పిల్లల దీర్ఘకాల సంబంధాలను ప్రభావితం చేస్తుంది.

Related Articles

Related image1
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Related image2
True Love Psychology: సైకాలజీ ప్రకారం మీ విలువ తెలిసిన వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
36
చిన్న విషయానికే భయపడటం..
Image Credit : Freepik

చిన్న విషయానికే భయపడటం..

సాధారణంగా స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. తల్లిదండ్రులు తరచుగా ఆందోళన, కోపం లేదా నిరాశలో ఉంటే, ఆ భావోద్వేగ వాతావరణం పిల్లల మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది. చిన్న పిల్లల మెదడు ఇంకా అభివృద్ధి దశలో ఉంటుంది కాబట్టి, ఇంట్లో తరచూ ఉద్రిక్త వాతావరణం ఉంటే వారి భావోద్వేగ నియంత్రణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా, వారు చిన్న విషయానికే భయపడటం, ఎక్కువ ఆందోళన, లేదా కోపం చూపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

46
చదువుపై ప్రభావం
Image Credit : Getty

చదువుపై ప్రభావం

తల్లిదండ్రుల స్ట్రెస్ పిల్లల చదువుపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోతే పిల్లల దృష్టి చెదిరిపోతుంది. వాళ్లు చదువుపై ఫోకస్ పెట్టలేరు. పైగా, తల్లిదండ్రుల స్ట్రెస్ వల్ల వచ్చే నెగెటివ్ కామెంట్స్ పిల్లల్లో సెల్ఫ్ డౌట్ ని పెంచుతాయి. దానివల్ల వారు తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయడం మొదలుపెడతారు.

56
స్ట్రెస్ హ్యాండిల్ చేసే విధానం ముఖ్యం
Image Credit : Istock

స్ట్రెస్ హ్యాండిల్ చేసే విధానం ముఖ్యం

సైకాలజీ ప్రకారం ప్రతి స్ట్రెస్ హానికరం కాదు. తల్లిదండ్రులు తమ ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తారో అది కీలకం. వారు పిల్లల ముందు సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తే, అది పిల్లలకు కూడా ఒక మోడల్‌గా పనిచేస్తుంది. ”సమస్యలు రావడం సహజం, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి” అనే సందేశం పిల్లలకు చేరుతుంది.

66
కుటుంబ వ్యవస్థపై ప్రభావం
Image Credit : pinterest

కుటుంబ వ్యవస్థపై ప్రభావం

సైకాలజీ నిపుణుల ప్రకారం తల్లిదండ్రుల స్ట్రెస్ వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. అది కుటుంబ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేసే అంశం. పిల్లలు తల్లిదండ్రుల మాటలకన్నా వారి భావోద్వేగాలను ఎక్కువగా గ్రహిస్తారు. కాబట్టి, పిల్లలపై కోపం వచ్చినప్పుడు పేరెంట్స్ కాసేపు సైలెంట్ గా ఉండాలి. లేదా పక్కకు వెళ్లాలి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Recommended image2
True Love Psychology: సైకాలజీ ప్రకారం మీ విలువ తెలిసిన వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved