MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?

Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?

పిల్లల్ని కొడితేనే మాట వింటారని చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. కానీ చెంప దెబ్బ పిల్లల్ని నిజంగా మార్చుతుందా? లేక వారి మనసులో కనిపించని గాయాలను చేస్తుందా? కోపంతో తల్లిదండ్రులు పిల్లల్ని చెంపదెబ్బ కొడితే అది వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో తెలుసా? 

2 Min read
Author : Kavitha G
Published : Feb 13 2026, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Child Psychology
Image Credit : Getty

Child Psychology

పిల్లల్ని పదే పదే చెంపపై కొట్టడం కొందరు తల్లిదండ్రులకు చిన్న శిక్షలా అనిపించవచ్చు. ఇలా కొట్టకపోతే మాట వినరు అనే భావన కూడా చాలామందిలో ఉండొచ్చు. కానీ శారీరక శిక్ష, ముఖ్యంగా చెంపపై కొట్టడం వంటి అవమానకరమైన చర్యలు, పిల్లల మనసుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని సైకాలజీ చెబుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పిల్లల ప్రవర్తన ఎలా మారుతుందంటే?
Image Credit : Freepik

పిల్లల ప్రవర్తన ఎలా మారుతుందంటే?

సైకాలజీ ప్రకారం శారీరక శిక్ష వల్ల తాత్కాలికంగా పిల్లలు భయంతో ఆగినా, దీర్ఘకాలంలో వారు మరింత ప్రతిఘటన స్వభావం, దూకుడు లేదా లోపల కోపంతో పెరుగుతారు. చెంపపై కొట్టడం వల్ల పిల్లల్లో భయం కలుగుతుంది. ఆ భయం కారణంగా వారు కొంతకాలం తప్పు చేయకుండా ఉండవచ్చు. లేదా తల్లిదండ్రుల ముందు ఒకలా, వేరు లేనప్పుడు మరొకలా ప్రవర్తించే ప్రమాదం ఉంది.

Related Articles

Related image1
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు చేసే 7 పనులు ఇవే!
Related image2
Breakup Psychology: Ex ని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమా? లేక ఈగోనా? సైకాలజీ ఏం చెబుతోంది?
36
సంబంధాలపై ప్రభావం
Image Credit : Istock

సంబంధాలపై ప్రభావం

సైకాలజీ నిపుణుల ప్రకారం చెంపపై కొట్టడం పిల్లల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. చిన్న వయస్సులోనే “నేను తప్పులు చేసే వ్యక్తిని”, “నన్ను కొట్టడం సహజమే” అనే భావన ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ప్రేమ, గౌరవం, మాటల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం బదులు, బలప్రయోగమే సరైన మార్గమని వారు నేర్చుకునే ప్రమాదం ఉంది.

46
పెద్దయ్యాక ఎలా ఉంటారంటే?
Image Credit : stockPhoto

పెద్దయ్యాక ఎలా ఉంటారంటే?

సైకాలజీ ప్రకారం శారీరక శిక్షకు గురైన పిల్లల్లో పెద్దయ్యాక కోపం, ఆవేశం, ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెంపపై కొట్టడం అవమాన భావాన్ని కలిగిస్తుంది. ఇతరుల ముందు ఇలా జరగడం వల్ల పిల్లలు లోలోపల బాధపడవచ్చు. లేదా ప్రతీకార స్వభావం పెంచుకోవచ్చు. ఇది వారి చదువు పైనా కూడా ప్రభావం చూపుతుంది. భయం, ఆందోళన ఉన్నప్పుడు నేర్చుకునే సామర్థ్యం తగ్గుతుంది. భావోద్వేగ భద్రత లేకపోతే సృజనాత్మకత, ప్రశ్నించే ధైర్యం, ఆత్మవిశ్వాసం తగ్గిపోతాయి.

56
కారణం తెలుసుకోవడం ముఖ్యం
Image Credit : stockPhoto

కారణం తెలుసుకోవడం ముఖ్యం

సైకాలజీ నిపుణుల ప్రకారం పేరెంట్స్ ముందుగా పిల్లల ప్రవర్తన వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలి. వారు అలసట, ఆకలి, దృష్టి ఆకర్షించాలనే కోరికతో అలా ప్రవర్తిస్తున్నారా అనేది గమనించాలి. సమస్యను అర్థం చేసుకోవడం శిక్షించడం కంటే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తప్పు జరిగినప్పుడు వెంటనే కొట్టడం బదులు, కళ్లలోకి చూసి ప్రశాంతంగా మాట్లాడాలి. నువ్వు చేసిన పని తప్పు, కానీ నువ్వు చెడ్డవాడివి కాదు అనే సందేశం ఇవ్వాలి. ఇది పిల్లల వ్యక్తిత్వాన్ని కాకుండా వారి ప్రవర్తనను మాత్రమే సరిదిద్దే విధానం.

66
పేరెంట్స్ ఎలా ఉండాలంటే?
Image Credit : pinterest

పేరెంట్స్ ఎలా ఉండాలంటే?

తల్లిదండ్రులు తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. చాలాసార్లు పిల్లల తప్పుకంటే పెద్దల ఒత్తిడి, ఆందోళనే కొట్టడానికి కారణమవుతాయి. కోపం వచ్చినప్పుడు కొంతసేపు దూరంగా వెళ్లడం మంచిది. కుటుంబంలో పరస్పర గౌరవం, పిల్లలతో క్వాలిటీ టైం గడపడం, వారి భావాలను అర్థం చేసుకోవడం , చిన్న చిన్న విజయాలను మెచ్చుకోవడం వంటివి పిల్లల వ్యక్తిత్వాన్ని బలపరుస్తాయి. ప్రేమ, సహనం, స్పష్టమైన మార్గదర్శకత వంటివి పిల్లలను బాధ్యతాయుతమైన, ఆత్మవిశ్వాసం గల వ్యక్తులుగా తీర్చిదిద్దే నిజమైన మార్గాలని సైకాలజీ నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
True Love Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా ప్రేమించే వాళ్లు చేసే 7 పనులు ఇవే!
Recommended image2
Breakup Psychology: Ex ని మర్చిపోలేకపోవడానికి కారణం ప్రేమా? లేక ఈగోనా? సైకాలజీ ఏం చెబుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved