విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి మెదడు ఆరోగ్యానికి మంచివి. బ్లూబెర్రీస్ వల్ల పిల్లలకి చాలా లాభాలున్నాయి.
చాలా మంది పిల్లలు వయసు పెరుగుతుంటే, తాము చదివింది మర్చిపోతున్నామని, గుర్తుండటం లేదు అని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. పాపం ఎంత కష్టపడి చదివినా పరీక్ష సమయానికి మర్చిపోతూ ఉంటారు. అలా పిల్లలు మర్చిపోకుండా.. అన్ని గుర్తుంచుకోవాలి అంటే, వారి మెదడు చురుకుగా ఉంచే ఆహారాలను కచ్చితంగా అందించాలి.
పిల్లల మెదడు బాగా డెవలప్ అయ్యే టైంలో, మంచి జ్ఞాపకశక్తి, తెలివితేటల కోసం పోషకాలు చాలా ముఖ్యం. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి మెదడు ఆరోగ్యానికి మంచివి. ఈ పోషకాలన్నీ బ్లూ బెర్రీస్ లో మెండుగా ఉన్నాయి.
బ్లూ బెర్రీస్ పిల్లలు ఎందుకు తినాలి?
బ్లూబెర్రీస్ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్లు బోలెడు ఉన్న బ్లూబెర్రీస్ పిల్లలకి మంచి జ్ఞాపకశక్తిని, మెదడు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి మెదడు పనితీరుని మెరుగుపరుస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. బ్లూబెర్రీస్ లో విటమిన్లు, మినరల్స్ బోలెడు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ల గని. బ్లూబెర్రీస్ లో ఉన్న పదార్థాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి, పార్కిన్సన్స్ లాంటి మెదడు వ్యాధులు వచ్చే అవకాశాన్ని 40% తగ్గిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
విటమిన్ సి ఎక్కువగా ఉన్న బ్లూబెర్రీస్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బ్లూబెర్రీస్ పెద్దవాళ్ళు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఫైబర్ ఉన్న బ్లూబెర్రీస్ తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. ఫైబర్ ఎక్కువగా ఉన్న బ్లూబెర్రీస్ తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది, పేగుల ఆరోగ్యం బాగుంటుంది. విటమిన్ సి ఉన్న బ్లూబెర్రీస్ చర్మానికి కూడా మంచివి.
గమనిక: డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే మీ డైట్ లో, మీ పిల్లలకు అందించే ఆహారంలో మార్పులు చేసుకోండి.
