Health tips: పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయద్దు!
పండ్లు.. ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ పండ్లు తినే విధానంలో కొన్ని తప్పులు చేస్తే.. అవి మనకు ప్రయోజనం కంటే హాని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి పండ్లు తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం
- FB
- TW
- Linkdin
- GNFollow Us

ఆరోగ్యకరమైన ఆహారం
ప్రతి రోజు వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది మెరుగైన ఆరోగ్యం కోసం వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటారు. ముఖ్యంగా పండ్లను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. ఇవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అయితే పండ్లను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అవెంటో ఇక్కడ చూద్దాం.
పండ్లు తినేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పండ్లల్లో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పండ్లు తినేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. వాటి వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చాలా మంది ఉదయం అల్పాహారం సమయంలో పండ్లు తినడానికి ఇష్టపడతారు. ఇది సరైన మార్గమే అయినప్పటికీ.. అన్ని రకాల పండ్లు ఈ సమయంలో తినడం మంచిది కాదు. ప్రతి పండు తినడానికి ఓ సమయం ఉంటుంది.
మధ్యాహ్న భోజనం తర్వాత..
చాలామంది మధ్యాహ్న భోజనం తర్వాత పండ్లు తింటారు. కొందరు సాయంత్రం లేదా రాత్రి కూడా పండ్లు తింటారు. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. భోజనం తర్వాత పండ్లు తినడం ఎంతవరకు సరైందో.. ఇక్కడ తెలుసుకుందాం.
భోజనం తర్వాత పండ్లు తింటే?
భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి ఆహారం తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. మరోవైపు పండ్లలో ఎక్కువ నీరు ఉంటుంది. అవి కడుపు, శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పండ్లు తినకూడదు. ఉదయాన్నే మీరు పండ్లు తినవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది.
ఈ పండ్లు అస్సలు తినకూడదు!
ఆహారం తిన్న తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఉండే పుల్లని పండ్లు తింటే అసిడిటీ సమస్య వస్తుంది. ఇది ఛాతిలో మంటతో పాటు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. శరీరంలో విష పదార్థాలు పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది.
చర్మ సమస్యలు
ఎప్పుడు పడితే అప్పుడు పండ్లు తినడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల, శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. దీని ప్రభావం మీ చర్మంపై వెంటనే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి గుర్తుంచుకోండి
- ఖాళీ కడుపుతో ఎప్పుడూ పుల్లని పండ్లు తినకూడదు.
- పాలతో పండ్లు తినడం కూడా మానుకోవాలి.
- రాత్రి పూట పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.
- పండ్లు తిన్న తర్వాత నీరు తాగకండి.