యువతర శక్తి, సామర్థ్యాలను వెలికితీయడమే ఆ ప్రవచన ఉద్దేశం
శుక్రవారం సామూహిక ప్రార్థనలలో ఖుత్బా (ప్రవచనం) చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే.. ఈ ఉపన్యాసం ఎలా ప్రారంభమైంది. దాని ఉద్దేశ్యం, అది ఎలా ఆచరించబడుతోంది అనే అంశాలపై చర్చ జరుగుతోంది.
శుక్రవారం సామూహిక ప్రార్థనలలో ఖుత్బా (ప్రవచనం) చాలా ప్రాముఖ్యత ఉంది. వ్యక్తి తనని తాను స్వీయ-సంస్కరణ, మార్గదర్శకత్వం చేసుకోవడానికి ఓ మహాతర అవకాశం. ఇది ముస్లింలను వారి మతంతో సన్నిహితంగా మెలిగేలా చేస్తుంది. కానీ.. ఆచరణలో మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే శుక్రవారం ప్రార్థనలకు వచ్చే ముస్లింలలో చాలామంది (ఖుత్బా) ప్రవచనాన్ని విస్మరిస్తారు. కొంతమంది మాత్రం అసలు పట్టించుకోరు.అందుకే ముస్లింల ఆచారం ఔచిత్యం, లక్ష్యాలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
శుక్రవారం ఉపన్యాసం/ప్రవచనం ఎలా ప్రారంభమైంది. దాని ఉద్దేశ్యం, అది ఎలా ఆచరించబడుతోంది అనే అంశాలపై నేడు చర్చ జరుగుతోంది.
శుక్రవారం ప్రవచన (ఖుత్బా) ముస్లిం సోదరులను మార్గనిర్దేశం చేసే సాధనం. ఇది ముస్లింలను దారితప్పకుండా.. విపత్కర పరిస్థితుల్లో నిరాశకు గురిచేయకుండా.. మతం ప్రాముఖ్యతను, వారి బాధ్యతలను గ్రహించేలా చేస్తుంది. ద్వేషాన్ని దూరం చేస్తుంది. మత సహనాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ముస్లిం మేధావులు, పండితులు శుక్రవారం ఉపన్యాసం (ఖుత్బా) కొనసాగించాలని చెబుతుంటారు. ఇమామ్ ఎంచుకున్న సబ్జెక్ట్‌ల ఎంపిక కూడా ఇక్కడ కీలకం. ప్రసంగంలో భాష, సమగ్రత కూడా అంతే ముఖ్యం. ఖుత్బాకు తగిన ప్రాముఖ్యత ఇస్తే.. అది మసీదులోని బోధకుని బాధ్యతను, గౌరవాన్ని మరింత పెంచుతుంది. వారి సందేశాన్ని ఓ ఆశీర్వాదంగా భావిస్తారు.
బోధకులు (ఇమామ్) తమ సందేశాలు ఎక్కువ మందికి చేరాలని స్థానిక భాషను ఉపయోగించాలని భావిస్తారు. అదే సమయంలో సందేశం సారాంశాన్ని కూడా చెడిపోకుండా చూసుకోవాలి. ముఖ్యంగా కొత్త తరం ఇమామ్ లు తమ సందేశ ప్రభావంగా.. ఎక్కువ మందికి చేరేలా చూసుకోవాలి. అదే సమయంలో తమ భాష, సంస్కృతి, నేపథ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మత పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర భారతదేశంలో ఉపన్యాసాలు చేసే వారికి హిందీ, ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. వారి ఉపన్యాసాల్లో హిందీ, ఆంగ్ల భాష పదాలతో పాటు సాధారణ అరబిక్,ఉర్దూ పదాలను ఉపయోగించాలి. బోధకుడు భావోద్వేగ పూరితంగా, అక్కడి ప్రజల నాడీ తెలుసుకుని, వారి మనస్సు తెలుసుకుని మాట్లాడాలి. అలాగే.. వారి ప్రసంగం కూడా చిన్నగా, సరళంగా ఉండేలా చూసుకోవడం మంచిది. ఎందుకంటే.. ప్రజలు ఎక్కువ సమయం కేటాయించలేరు. అదే సమయంలో ఆ ప్రసంగంపై దృష్టిని కేంద్రీకరించలేరు. అలాంటి వ్యక్తులు శుక్రవారం ప్రార్థన సమయంలో ఎక్కువసేపు మసీదులో ఉండరు. ఈ రోజుల్లో.. ఉపన్యాసాల యొక్క ప్రధాన లోపం ఏమిటంటే.. బోధకులు సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. వారి ప్రసంగాల్లో నిరాధారమైన కథలు, ఉదంతాలను జోడిస్తున్నారు. ఇలాంటి ప్రసంగాలు సరైనవి కావు. శుక్రవారం ప్రసంగంలో కేవలం మతపరమైన సందేశం మాత్రమే కాదు.. ప్రాపంచిక సమస్యలపై అవగాహన,పరిష్కారాలను వెతికేలా ఉండాలి. అదేసమయంలో సానుకూల ఆలోచనతో అందమైన పదాలలో వ్యక్తీకరించాలి.
జమాతే ఇస్లామీ హింద్ ప్రముఖ మేధావి డాక్టర్ రజీ ఉల్ ఇస్లామ్.. ఉపన్యాసం నియామాలు ఇలా పేర్కొన్నారు. మొదటి ఉపన్యాసం అరబిక్‌లో ఉండవలసిన అవసరం లేదు; స్థానిక భాషలో ఇవ్వడం మంచిది. వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఉపన్యాసం ఉద్దేశం. స్థానిక భాషలో ఉపన్యాసం సాగితే.. అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. చాలా మంది మేధావులు ఈ ఆలోచనను సమర్థించారు. దీనిపై చర్చ జరుగుతోందని డాక్టర్ రజీ ఉల్ ఇస్లామ్ అంటున్నారు. నేడు మసీదుల్లో చర్చలు జరపడం కష్టంగా మారిందని అన్నారు. ఒకప్పుడు మదీనాలోని ప్రవక్త మసీదు ప్రతి అంశాన్ని చర్చించే సామాజిక కేంద్రంగా ఉన్నప్పటికీ.. నేడు ఇది మతపరమైన, సామాజిక, సాహిత్య వేడుకలకు కేంద్రంగా మారిందని అంటున్నారు.
కొంతమంది ప్రజలు అల్లాహ్ సందేశాన్ని అరబిక్‌లోనే బోధించాలని భావిస్తారు. మరికొందరు స్థానిక భాషను ఇష్టపడతారు. శుక్రవారం ప్రార్థనల్లో మొదటి ఉపన్యాసం ఉర్దూలో అందించాలని కొందరూ భావిస్తారు. ఎందుకంటే ఇది ప్రజల జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కానీ, ఖుత్బాకు ఎటువంటి షరతు లేదనీ, కానీ పండితుడు లేదా ముఫ్తీ మాత్రమే దానిని అందించాలని డాక్టర్ రజీ-ఉల్-ఇస్లామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్లోకాలు, హదీసులు సరిగ్గా ప్రదర్శించబడేలా వ్యక్తీకరణ మాతృభాషలో ఉండాలనీ, అల్లాహ్ యొక్క ప్రవక్త యొక్క ఖుత్బాను హదీసులలో కుర్చాలని భావిస్తున్నారు.
మరో ప్రముఖ పండితుడు మౌలానా జహీర్ అబ్బాస్ రిజ్వీ ఇలా అంటాడు. "శుక్రవారపు ఖుత్బాలో శుక్రవారం ప్రార్థన స్ఫూర్తి ఉంటుంది. కానీ ఇప్పుడూ ఆ భావన లేదు. ప్రవచనం పేరుతో చాలా తప్పుదారి పట్టించే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ, ఉపన్యాసంలో ఐక్యత, ఒప్పందం గురించి మాట్లాడాలి. ఇది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా ఉండాలి. భావోద్వేగాలకు దూరంగా.. ఆచరణాత్మకత గురించి మాట్లాడాలి. ఘర్షణకు దూరంగా ఉండాలి " అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
మాలేగావ్ పండితుడు, సంస్కృత నిపుణుడు మౌలానా జలాలుద్దీన్ ఖాస్మీ (అవాజ్-ది వాయిస్)తో మాట్లాడుతూ.. "బోధనల్లో సమగ్రమైన ఆలోచన, సిద్ధాంతం అవసరం. ఇవి మత గురువులు లేదా పండితుల గుత్తాధిపత్యం కాదు. ఖుత్బా అనేది ముస్లింలందర్ని ఏకం చేసే.. గొప్ప మాధ్యమం. మీ సమస్యలకు మీరు పరిష్కారాలు కనుగొనగలరు” అని ఆయన అన్నారు. మౌలానా ఖాస్మీ ఇంకా మాట్లాడుతూ.. "కొత్త తరానికి ఖుత్బా అందించడానికి అవకాశం ఇవ్వాలి. యువకులు కొత్త వాటిపై పరిశోధన చేసి ప్రసంగాలను అందించగలరు. వాళ్ళు ఎలాంటి తప్పు చేసిన ఫర్వాలేదు" అని అభిప్రాయాన్ని పంచుకున్నారు
సూఫీ పండితుడు, అంతర్జాతీయ సూఫీ కారవాన్ అధిపతి ముఫ్తీ మంజూర్ జియా మాట్లాడుతూ.. శుక్రవారం ప్రసంగం ప్రాముఖ్యతను ఇలా వివరించారు. ఇది ముస్లింలకు సామాజికంగా, రాజకీయంగా, వృత్తిపరంగా మార్గనిర్ధేశం చేసే మార్గమని పేర్కొన్నారు. ముస్లింలలో అవగాహన కల్పించడంతోపాటు బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడమే శుక్రవారం ఉపన్యాసం (ప్రసంగం) ఉద్దేశమని సూఫీ పండితుడు అన్నారు. పండితులు, ప్రబోధకులు బోధనలు సమాజాన్ని నడిపించడానికి ఉపయోగపడుతాయని తెలిపారు. ఖుత్బా సంప్రదాయం ముస్లింలు తమ మతం ద్వారా ప్రపంచంతో అనుసంధానించబడి ఉండటానికి వారి చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుని, వారి బాధ్యతను విస్మరించకుండా ఏర్పాటు చేయబడిందని ముఫ్తీ జియా తెలిపారు.
ఇదే అంశంపై ముంబయికి చెందిన అంజుమన్-ఏ-ఇస్లాం అధినేత డాక్టర్ జహీర్ ఖాజీ మాట్లాడుతూ.. ఖుత్బా (ప్రబోధం) అంటే కేవలం ప్రసంగం మాత్రమే కాదని, ప్రజలకు మార్గం చూపే బాధ్యత కూడా ఉందన్నారు. ఖుత్బా నాయకత్వపు పని అని ఆయన అన్నారు. దీనికి మతపరమైన ఆధిక్యత, ప్రాపంచికత కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ప్రసంగానికి హాజరయ్యే వారికి మతంతో పాటు ప్రపంచంపై అవగాహన కల్పించాలన్నారు. వివిధ అంశాలపై చర్చించాలనీ, సంచలనాలకు దూరంగా ఉండాలని, రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. అదే సమయంలో ప్రసంగాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎల్లప్పుడూ సమయం తక్కువగా ఉండాలని కోరుకుంటారనీ, ఆ తక్కువ సమయంలోనే తమ ప్రసంగం హృదయాన్ని, మనసును తాకాలని అంటారు.
మహిళల హక్కుల గురించి ఖుత్బాలో మాట్లాడటం వంటి చర్యలు చేపట్టి షరియత్‌ను పరిరక్షించాలన్నారు. ఈ నేపథ్యంలో దేశ పరిస్థితి మరీ దారుణంగా ఉందనీ, లోపాలను గుర్తించడం కూడా చాలా ముఖ్యమని డాక్టర్ జహీర్ ఖాజీ సూచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఖుత్బా మతపరమైన విషయాలతో పాటు ప్రాపంచిక, వృత్తిపరమైన అంశాలను వెలుగులోకి తీసుకరావడానికి , వాటిపై అవగాహన కల్పించడానికి ఉపయోగపడాలని అన్నారు. ఈ క్రమంలో నైతికపరమైన అంశాలను కూడా బోధించడం ముఖ్యమే అంటున్నారు. ఇది అల్లాహ్ దూత (ఇమామ్)బోధన అని అభివర్ణించారు.
అలాగే..ఖుస్రో ఫౌండేషన్ కన్వీనర్, పండితుడు, డాక్టర్ హఫీజుర్ రెహమాన్ మాట్లాడుతూ.. శుక్రవారం ప్రసంగ భావన ముఖ్యమైనది. ఇది మొత్తం మానవాళికి ఉద్దేశించబడింది. సమాజంలో ఎలా జీవించాలి. వ్యాపారంలో ఎలాంటి నియమాలు పాటించాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి. అనే తదితర అంశాలకు సంబంధించి శుక్రవారం నాటికీ ప్రసంగంలో ఉండాలని పేర్కొన్నారు. ఇస్లామిక్ యుగంలో..ఖుత్బా అనేది ప్రభుత్వం లేదా ఖలీఫా మార్గదర్శకత్వంగా భావించేవారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా దీన్ని ఖచ్చితంగా అప్‌గ్రేడ్ చేయాలని అభిప్రాయపడ్డారు.
రచయిత - మన్సూరుద్దీన్ ఫరీది / న్యూఢిల్లీ.