అమెరికన్ వ్యక్తులను పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డు పొంది అమెరికాలో స్థిరపడొచ్చన్న కొంతమంది భారతీయుల వీక్ పాయింట్ ని ఓ ఎన్ఆర్ఐ క్యాష్ చేసుకున్నాడు. సెక్స్ రాకెట్ మాదిరిగా మ్యారెజ్ రాకెట్ నిర్వహించాడు. చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన రవిబాబు కొల్ల అనే వ్యక్తి అమెరికాలో సెటిల్ అయ్యాడు. కాగా.. అతను   ఫిబ్రవరి 2017 నుంచి ఆగస్టు 2018 వరకు అతడు అమెరికన్ వ్యక్తులతో చాలా మంది భారతీయులకు పెళ్లి జరిపించాడు. కేవలం అమెరికన్ వ్యక్తులను పెళ్లి చేసుకోవడం వల్ల ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు పొందొచ్చని భారతీయులను రవి నమ్మించేవాడని అధికారులు తెలిపారు. 

దాదాపు 80 మంది ఇలాంటి స్వార్థ ప్రయోజనం కోసం పెళ్లి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దాని వెనుక రవి హస్తం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రవిని అరెస్ట్ చేశారు. రవితోపాటు ఫ్లోరిడాకు చెందిన క్రిస్టల్ క్లౌడ్, అల్తాలు కలిసి ఈ పని చేశారని పోలీసుల విచారణలో తెలిసింది. మరో 10 మంది ఉద్యోగులను నియమించుకుని మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేశారని పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచే ఈ తతంగం మొత్తం నడిపించారని వారు తెలిపారు.