ట్రంప్ సర్కారులో మరో ఇండియన్‌కి చోటు!

Indian-American Attorney Uttam Dhillon Is Th New Head For US Drug Enforcement Agency
Highlights

న్యాయశాస్త్రంలో అపారమైన ప్రతిభ ఉత్తమ్ ధిల్లాన్ సొంతం. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న రాబర్ట్ రాటర్సన్ పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానాన్ని అటార్నీగా పనిచేస్తున్న ఉత్తమ్ ధిల్లాన్ భర్తీ చేయనున్నారు

అమెరికాలో భారత సంతంతికి చెందిన వ్యక్తులకు ఉన్నత పదవులు లభిస్తున్నాయి. ట్రంప్ సర్కాలు అమెరికన్ ఇండియన్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా.. ట్రంప్ అధిష్టానంలో మరో ఇండియన్‌కు చోటు దక్కింది. అమెరికాలోని డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీకి కొత్త చీఫ్‌గా ఉత్తమ్ ధిల్లాన్ నియమితులయ్యారు.

న్యాయశాస్త్రంలో అపారమైన ప్రతిభ ఉత్తమ్ ధిల్లాన్ సొంతం. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న రాబర్ట్ రాటర్సన్ పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానాన్ని అటార్నీగా పనిచేస్తున్న ఉత్తమ్ ధిల్లాన్ భర్తీ చేయనున్నారు. డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ అమెరికాలో డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, మత్తుపదార్థాల వాడకాన్ని నియంత్రించడంలో పనిచేస్తుంది.

ఉత్తమ్‌ ధిల్లాన్ ఇదివరకు వైట్‌హౌస్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సిల్‌, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. 'అమెరికాలో ప్రతి తొమ్మిది నిమిషాలకు ఓ వ్యక్తి డ్రగ్‌ ఓవర్‌డోస్‌తో చనిపోతున్నారు. మన దేశం తీవ్రమైన డ్రగ్స్‌ సమస్యతో బాధపడుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు' అని ఉత్తమ్‌ నియామకం గురించి ప్రకటించిన అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌ అన్నారు.

మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టే దిశగా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగం కృషి చేయాల్సి ఉంటుందని, తమ అధ్యక్షుడు ట్రంప్‌ కూడా మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బలమైన అధికారాలు ఇస్తున్నారని సెషన్స్ చెప్పారు. ఉత్తమ్‌ ధిల్లాన్‌కు వైట్‌హౌస్‌లోని న్యాయ విభాగం, హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ విభాగాల్లో పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది.

అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తి రేసులో ఇండియన్!
మరోవైపు అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన ప్రముఖ జడ్జి అమూల్ థాపర్ (49) పేరును ట్రంప్ పరిగణలోకి తీసుకున్న సంగతి తెలిసినదే. థాపర్ పేరును సెనేట్ ఆమోదిస్తే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తిగా అమూల్ థాపర్ చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం తొమ్మిది మంది సభ్యులతో కూడిన అమెరికా సుప్రీం కోర్టులో జస్టిస్ ఆంథోనీ కెన్నెడీ (81) పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
 

loader