ఘోరం: ఇద్దరు విద్యార్థినులపై నాలుగు రోజులు స్కూల్ టీచర్ రేప్

ఘోరం: ఇద్దరు విద్యార్థినులపై నాలుగు రోజులు స్కూల్ టీచర్ రేప్

కోల్ కతా :  పిల్లలకు బుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడే నీతి తప్పి వ్యవహరించాడు. ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాలుగో తరగతి చదవుతున్న ఇద్దరు విద్యార్థినులపై నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ దినాజ్ పూర్ జిల్లా రాయిగంజ్ లో జరిగింది. రాజధాని కోల్ కత్తాకు ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  

బడి సమయం దాటిన తర్వాత అతను వరుసగా నాలుగు రోజుల పాటు ఆ దారుణానికి పాల్పడ్డాడు. తాను బడికి వెళ్లనని ఓ విద్యార్థిని తల్లిదండ్రుల వద్ద మొండికేసింది. వారు అందుకు గల కారణాన్ని నిలదీసి అడగడంతో విషయం చెప్పింది. దాంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

తన విషయమే కాకుండా మరో బాధిత బాలిక విషయం కూడా ఆమె చెప్పింది. దాంతో విషయం చెప్పిన బాలిక తల్లిదండ్రులు మరో బాధిత బాలిక ఇంటికి వెళ్లారు. దాంతో రెండో బాలిక కూడా తనపై జరిగిన అత్యాచారం గురించి చెప్పింది.

ఇద్దరు విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 35 ఏళ్ల వయస్సు గల నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos