నాగోల్ స్టేషన్ లో మెట్రో రైల్ షాక్

park and ride metro travel becomes costlier from Nagole station
Highlights

నాగోల్ ప్రయాణికులకు పార్కింగ్ ఫీజు భారం

హైదరాబాద్ మెట్రోరైల్ షాక్ మొదలయింది. ఉద్యోగాలు చేసుకునే వారికి మెట్రో రైలు అందుబాటులో లేకుండా పోయేలా ఉంది. ఎందుకంటే, టూవీలర్, ఫోర్ వీలర్ ఉన్న వారికి మెట్రో ప్రయాణం బాగా బారమవుతున్నదని  చెబుతున్నారు. కారణం. మెట్రో విధిస్తున్న పార్కింగ్ ఫీజు.

ఈ విషయంలో నిన్న నాగోల్ దగ్గిర గొడవకూడాజరిగింది. డిసెంబర్ 29 నుంచి నాగోల్ స్టేషన్ వద్ద మెట్రో రైలు సిబ్బంది  పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం మొదలుపెట్టారు.  టూవీలర్ కు మొదటి రెండు గంటలకు రు. 5, ఆపైన ప్రతి గంటకు రెండురుపాయలు వసూలు చేయాలి.ఇక ఫోర్ వీలర్ కు సంబంధించి మొదటి రెండు గంటలకు 12 రుపాయలు, ఆపైన ప్రతి గంటకు  6 రుపాయలు వసూలు చేయడం  మొదలుపెట్టారు. ఈ విషయం తెలియకపోవడంతో నిన్న నాగోల్ స్టేషన్ దగ్గిర చాలా ప్రయాణికులు గొడవపడ్డారు. దీనితో  చాలా తక్కువ వాహానాలను పార్కింగ్ చేశారు.  ఇది చాలా ఎక్కువ ఫీజు అని, ఉద్యోగాలకు దూరంగా పోయే ప్రయాణికులకు భారతమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే, పొద్దున నాగోల్ మెట్రో వద్ద టూవీలర్  లేదా ఫోర్ వీలర్ పార్క్ చేసే, సాయంకాలం మెట్రలో వచ్చి అక్కడి నుంచి వాహనం తీసుకుని ఇళ్లకు వెళ్తారు. కనీసం పదిగంటల పాటువాహనం మెట్రో స్టేషన్ లో ఉంటుంది. ఈ పదిగంటలకు  టూవీలర్ కు 21 రుపాయలు, ఫోర్ వీలర్ కు 60 రుపాయల పార్కింగ్ ఫీజు చెలించాల్సి ఉంటుంది. దీనితో పాటు టికెట్ ధర  రు. 10 నుంచి రు. 60దాకా ఉంటుంది. దీనితో మెట్రో ప్రయాణం సుఖం అనుకుంటే ఆర్థిక భారమవుతున్నదని నాగోల్ స్టేషన్ దగ్గిర చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. విహార యాత్రగా ఎపుడో ఒకసారి మెట్రో లో ప్రయాణించేవారికి ఇది భారం అనిపించదు. అయితే, ప్రతి రోజు ఉద్యోగం కోసం ట్రోలో ప్రయాణించేవారికి ఇది భారమవుతుందని అంతా అంటున్నారు. అయితే, ఇతర మెట్రోస్టేషన్ లలో పార్కింగ్ ఫీజు లేదు. ఇది ఇపుడు ఒక్క నాగోల్ స్టేషన్ లోఉంది. ఫలితంగా నాగోల్ నుంచి ప్రయాణించే ఉద్యోగులకు మెట్రో ప్రయాణం భారమయింది. అసలే టికెట్ ధర అంటున్నపుడు పార్కింగ్ తోడవటం నిరుత్సాహ పరుస్తూ ఉందని ప్రయాణికులంటున్నారు.

loader