శ్రీకాకుళం బాగా వెనకబడిన జిల్లాయే కాని డేంజర్ జిల్లా కాదు. అక్కడ మనుషులు కూడా ఎవరూ అంత డేంజర్ కాదు.

 

ఉత్తరాంధ్ర వెనకబడింది, అదుకోండి అనే అర్తనాదం తప్ప ఈ జిల్లాలనుంచి  ఎపుడు డేంజరస్ పోలిటికల్ స్లోగన్స్ కూడ రాలేదు. పెద్ద పెద్ద డిమాండ్లు కూడా చేయలేని చిన్నచిన్న మనుషులు అక్కడి ప్రజలు. అయితే, ఇపుడు ఈ జిల్లాలోకి డేంజర్ జోన్ వచ్చేసింది.  ప్రభుత్వం ఈ జిల్లలోని  కోవూరు ప్రాంతాన్ని డేంజర్ జోన్ గా మార్చేసింది.  ఈ మేరకు నిన్న ఉత్తర్వుల కూడా జారీ చేసింది. ఈ డేంజర్ కేంద్రం కొవ్వాడ.

 

అందరికి వినిపించేంత పెద్ద కీర్తి కాదు కొవ్వాడ. న్యూక్లియన్ హబ్ అనే మాటతో పాటు రెండేండ్లుగా ఈ మారుమాల మామూలు గ్రామం కూడ వార్తల కెక్కింది. కల్లోల ప్రాంతమయింది.   కారణం ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం.

 

రాష్ట్ర ప్రభత్వానికి హబ్ పిచ్చి- టూరిజం హబ్, ఇండస్ట్రియల్ హబ్, ఎజుకేషన్ హబ్, ఐటి హబ్... ఇలాంటి హబ్ లు పర్వాలేదు. ఇపుడు  ఈ హబ్ ల మోజు లో పడి రాష్ట్రాన్ని న్యూక్లియార్ పవర్ హబ్ చేయాలన్న కేంద్ర  ప్రతిపాదనలకు ఒప్పేసుకుంది. రాష్ట్రంలో ఆరు న్యూకియార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు ఒప్పేసుకుంది. ఇందులో ఒకటి ఈ అమయాకపు  కొవ్వాడలో పడతావుంది.

 

 ప్రజలనుంచి వ్యతిరేకత రాగనే, ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ఈ న్యూక్లియార్ పవర్ ప్లాంట్స్  మాకొద్దు బాబోయ్ అన్నాయ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదే అవకాశమని కోస్తానంత న్యూక్లియర్ పవర్ హబ్ గా మార్చేస్తానని కేంద్రానికి అంగీకారం తెలిపింది.  2011లో జపాన్ లో సునామీ సమయంలో జరిగిన ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో దాదాపు 20 వేల మంది పోయాక ప్రపంచమంతా న్యూక్లియార్ పవర్ ప్లాంట్  ల మీద వ్యతిరేకత మొదలయిన సంగతితెలిసిందే. ఈ రోజు ఫుకుషీమా ఒక స్మశానంగా మిగిలి ఉంది. ఆంధ్రప్రభుత్వం ఈ ప్లాంట్స్  ఏర్పాటుకు అంగీకరించేనాటికి ఫుకుషీమా స్మశాన వాటిక ఫోటోలు ప్రపంచమంతా వ్తాప్తి చెందాయి. అయినా, రాష్ట్రం భయపడటం లేదు.

 

 2014 జూన్ లో ఉన్నట్లుండి ఆంధ్రలో ఆరున్యూక్లియార్ ప్లాంట్లు అనగానే  ప్రపంచం యావత్తు  తెలుగోళ్ల వైపు ఆశ్యర్యంగా చూశారు. అప్పటినుంచి  ఈ ప్లాంట్ల  ఏర్పాటును వ్యతిరేకిస్తూ పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. అయినా, లెక్క చేయకుండా ప్రభుత్వం  అణువిద్యుత్కేంద్ర ఏర్పాటుకు ముందుకువెళ్లి కొవ్వాడ డేంజర్ జోన్ ను ఏర్పాటు చేసింది. ఈ డేంజర్ జోన్ ఇలా ఉంటుంది.

 

అణు విద్యుత్‌ కేంద్రం  రియాక్టర్‌కు కిలోమీటర్‌ వరకు ఎటువంటి జనావాసాలూ ఉండకూడదు. ఈ ప్రాంతం సమీపంలో  జన సంచారం ఉండరాదు.  కిలోమీటర్‌ ప్రారతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటుచేసి ఆ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా విద్యత్కేంద్రం ఆధీనంలో ఉంచాలి.

 

దీంతో ఈ ప్రాంతం డేంజర్‌ జోన్ అయింది.


అణు విద్యుత్‌ కేంద్ర ప్రాంతంలో ఎక్సక్లూజన్‌ జోన్, నేచురల్‌ గ్రోత్‌ జోన్, ఎమర్జన్సీ ప్లానింగ్ జోన్, రేడియోలాజికల్‌ సర్వైలెన్స్‌ జోన్ లు ఉంటాయి. ఎక్స్‌క్లూజిన్‌ జోన్‌ పరిధిలో రామచంద్రపురం టెక్కలి, గూడెం, తాజాగా జీరు కొవ్వాడ, కోటపాలెం గ్రామాలను చేర్చారు. ఈ జోన్‌ పరిధిలో రేడియేషన్‌ నివారణకు ప్రత్యేక పాత్‌వేలను ఏర్పాటు చేస్తారు.

 

ప్రభుత్వం ప్రకటిరచింది. రియాక్టర్‌ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధి వరకు నేచురల్‌ గ్రోత్‌ జోన్‌లో 14 గ్రామాలు ఉంటాయి. అవి - అక్కయ్యపాలెం, చిల్లపేటరాజాం, దేరాసం, కోటపాలెం, జీరుకొవ్వాడ, మరువాడ, మెరటాడ, ఎన్‌జి రాజపురం, పాపారావుపేట, పాతర్లపల్లె, పాతసూదరపాలెం, సీతారారపురం, సూరంపేట, తెప్పలవలస.

 

ప్రధాన రియాక్టర్‌ నుంచి 16 కిలోమీటర్ల పరిధి వరకు ఉండే ఎమర్జెన్సీ ప్లానింగ్‌ జోన్ లో అత్యవసర సేవల కోసం సమాచార, రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ అత్యవసర రక్షణ ప్రణాళిక తయారుచేస్తారు.

 

ఇక రేడియాలజికల్‌ సర్వైలెన్స్‌ జోన్‌ రియాక్టర్‌ నురచి 30 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది. ఈ ప్రాంతంలో అణువిద్యుత్‌ కేంద్రం అభివృద్ధిక కార్యక్రమాలు, ప్రత్యేక ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి వాటికి అనుమతి ఇస్తారు.