ఈ వీడియో చూస్తే రైల్లో టీ తాగరు

bath room water tea train
Highlights

బాత్‌ రూంలో టీ‌ .వీడియో వైరల్‌ 

ఓ టీ అమ్మే వ్యక్తి బాత్‌ రూం డోర్‌ కొట్టి చాయ్‌ అనగానే అందులోంచి మరో వ్యక్తి మూడు చాయ్‌ క్యాన్‌లను అతని చేతికి అందించాడు. అందులో ఓ క్యాన్‌ని ఫ్లాట్‌ ఫాంపై ఉన్న మరో టీ అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. మిగతా రెండు టీ క్యాన్‌లను వారిద్దరూ తీసుకెళ్లారు. 

అయితే టీ క్యాన్‌లలో బాత్‌ రూంలోని నీళ్లు కలిపారా, లేక ఖాళీ క్యాన్‌లలో బాత్‌ రూం నీళ్లు నింపి వాటితో టీ తయారు చేస్తున్నారా అనే ప్రశ్నలు ఈ వీడియో చూసిన వాళ్లలో తలెత్తుతున్నాయి. . ఈ తతంగాన్నంతా వీడియో తీసిన వ్యక్తి వారిని ప్రశ్నించగా తడబడుకుంటూ అక్కడి నుంచి నిదానంగా జారుకున్నారు. వీరంతా తెలుగులోనే మాట్లాడటంతో ఈ ఘటన జరిగింది తెలుగు రాష్ట్రాల్లోనే అనే విషయం స్పష్టమవుతోంది.

 

loader