భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కీచకులు రెచ్చిపోయారు. 36 ఏళ్ల మహిళపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెవా జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వంటలు చేసుకుని బతికే మహిళపై ఆ దారుణం జరిగింది.

ఆ సంఘటన అక్టోబర్ 1వ తేదీన జరిగింది. అయితే, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ స్పృహ కోల్పోవడంతో నిందితులు ఆమెను సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకుని వెళ్లారు. 

బాధితురాలు కోలుకుంటోందని, అయితే వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని పోలీసులు చెబుతున్నారు. ఆరుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్టు చేేశారు 

భర్తను కోల్పోయిన మహిళ వంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మహిళ అదృశ్యంపై అంతకు ముందు కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆస్పత్రి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. 

స్పృహ కోల్పోయిన మహిళను ఆస్పత్రిలో చేర్చిన దుండగులు ఆ తర్వాత పరారయ్యారని పోలీసులు చెప్పారు తన తల్లి ఒంటరిగా ఉన్న సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె కుమారుడు ఆరోపించాడు.