Asianet News TeluguAsianet News Telugu

వణికిస్తున్న అంఫాన్ తుఫాను.. అసలు ఈ సైక్లోన్ కి పేరు ఎవరు పెడతారు?

ఈ తుఫానుకి అంఫాన్ అనే పేరు ఎలా వచ్చింది. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు..? అసలు తుఫాన్లకు పేర్లేంటి..? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా..? ఒక్క అంఫాన్ తుఫాను మాత్రమే కాదు... ఇటీవల వచ్చిన ఫణి, పెథాయ్, హుద్ హుద్, తిత్లీ... ఇలా అన్ని తుఫాన్ లకు ఒక్కోపేరు ఉంటుంది. 

who will decide cyclone names, what is the story behind that
Author
Hyderabad, First Published May 20, 2020, 11:18 AM IST

సూప‌ర్ సైక్లోన్ అంఫాన్ దూసుకువస్తోంది. మరికాసేపట్లో ఈ తుఫాను బెంగాల్ తీరాన్ని తాకనుంది. అంఫాన్ కాస్త బ‌ల‌హీన ప‌డ్డ‌ప్ప‌టికీ గంట‌ల‌కు 180కి.మీ వేగంతో గాలుల‌తో బెంగాల్ లోని దిఘా, బంగ్లాదేశ్ లోని హాతియా మ‌ధ్య తీరాన్నితాకే అవ‌కాశం ఉంది. తీరంను తాకే స‌మ‌యంలో భారీ నుండి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవకాశం ఉంది. 

బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ ఈదురు గాలుల‌తో వ‌ర్షాలు ప‌డుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. ఈ తుఫాన్ దాటికి ప్ర‌భావితం అయ్యే 3ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించే ప్ర‌క్రియ మొద‌లైంది. ఎన్టీఆర్ఎఫ్, భార‌త నేవీ బృందాలు ఇప్ప‌టికే శ్ర‌మిస్తున్నాయి. బంగాళ‌ఖాతంలో ఇలాంటి సూప‌ర్ సైక్లోన్లు అరుదుగా వ‌స్తాయ‌ని అధికారులంటున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే... ఈ తుఫానుకి అంఫాన్ అనే పేరు ఎలా వచ్చింది. దానికి ఆ పేరు ఎవరు పెట్టారు..? అసలు తుఫాన్లకు పేర్లేంటి..? ఈ సందేహాలు మీకు కూడా కలిగాయా..? ఒక్క అంఫాన్ తుఫాను మాత్రమే కాదు... ఇటీవల వచ్చిన ఫణి, పెథాయ్, హుద్ హుద్, తిత్లీ... ఇలా అన్ని తుఫాన్ లకు ఒక్కోపేరు ఉంటుంది. 

వీటికి పేరు పెట్టడానికి ప్రత్యేకంగా ఓ సంస్థ పని చేస్తుందన్న విషయం మీకు తెలుసా..?

మీరు చదవింది నిజమే.. దక్షిణాసియా, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో తుఫాన్‌లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి ప్రారంభమైంది. అంతకు ముందు హిందూ. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో పుట్టిన ఎన్నో తుఫాన్లకు పేర్లు లేవు. 

కానీ... అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో వచ్చే తుఫాన్ లకు మాత్రం 1953 వ సంవత్సరం నుంచే పేర్లు పెట్టే సంప్రదాయం ఉంది.

తుఫాన్లకు పేరు పెట్టకపోతే... వాటి గురించి వార్తల్లో రాయాలన్నా, చర్చించాలన్నా ఇబ్బందికర పరిస్థితుల తలెత్తుతాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి కూడా సమస్యలు తలెత్తేవి. 

అందుకే..  తుఫాన్‌లకు పేర్ల పెట్టాలని పలు దేశాలు నిర్ణయించాయి. 2004లో డబ్ల్యూఎంవో ( ప్రపంచ వాతావరణ సంస్థ) ఆధ్వర్యంలో హిందూ, బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీరాల పరిధిలోని దేశాలు సమావేశమయ్యాయి. 

ఆ సమావేశంలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, శ్రీలంక, థాయిలాండ్ పాల్గొని ఒక్కో దేశం 8 పేర్లను సూచించాయి.

 మొత్తం 8 దేశాలు తలో 8 పేర్లను సూచించడంతో మొత్తం 64 పేర్లతో జాబితాను రూపొందించారు. ఆ పేర్లలో ఇప్పటి వరకు 56 పేర్లను వాడేశారు. మిగిలిన పేర్లు కూడా అయిపోతే... మళ్లీ ఈ దేశాలన్నీ సమావేశమై మరికొన్ని పేర్లను తయారు చేస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios