Asianet News TeluguAsianet News Telugu

Corbevax: శుభ‌వార్త‌.. 5-12 ఏండ్ల చిన్నారుల‌కు కరోనా టీకా..: ప్రభుత్వ కమిటీ సిఫార్సు

Corbevax: చిన్నారుల కోసం సరికొత్త కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది.  5 నుంచి 12 ఏళ్లలోపు చిన్నారుల కోసం బయోలాజికల్ ఈ లిమిటెడ్ త‌యారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్(Corbevax) వేయ‌డానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నిపుణల కమిటీ అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది.
 

vaccine Corbevax emergency use nod for 5 to 11 years age group in India
Author
Hyderabad, First Published Apr 21, 2022, 11:03 PM IST

Corbevax: దేశంలో మరోసారి కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఫోర్త్ వేవ్ ప్రారంభ‌మైంద‌నే క‌థ‌నాలు రావ‌డంతో ప్ర‌జ‌లుల భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. అయితే కొద్దిరోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుంటే.. చేతులు దాటే ప్ర‌మాదముంద‌నే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఫ‌స్ట్, సెంక‌డ్, థ‌ర్డ్ వేవ్ లు ఎలాంటి దారుణాల‌ను, ఘోరాల‌ను మిగిల్చాయో ప్రత్యక్షంగా చూసిన ప్రజలు ఫోర్త్ వేవ్ ప్రకటనలలో బెంబేలెత్తిపోతున్నారు.  

ఈ క్రమంలోనే కేంద్రం.. రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. వ్యాక్సినేషన్ ను వేగ‌వంతం చేయ‌మ‌ని సూచించింది. ఈ నేప‌థ్యంలో దేశంలోని అన్ని వయస్కుల వారికి కరోనా టీకా అందుబాటులోకి   తీసుక‌రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 సంవ‌త్సరాల పైబ‌డిన వారికి మాత్ర‌మే క‌రోనా టీకా అందుబాటు ఉండ‌గా.. ఇక నుంచి 5 నుంచి 12 సంవ‌త్స‌రాల చిన్నారుల‌కు కూడా క‌రోనా టీకా అందుబాటులోకి రానుంది.  

భారత్‌ బయోటెక్‌ హైదరాబాద్ .. అభివృద్ది చేసిన  కొర్బెవ్యాక్స్‌ టీకా ను 5-12 వయసు పిల్లల కోసం ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) గురువారం సమావేశమైంది. 5-12 వయసు పిల్లలకు అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్‌, కొర్బెవ్యాక్స్‌ వ్యాక్సిన్లు ఇవ్వడంపై ఈ కమిటీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రెండు టీకాలకు సంబంధించిన సిఫార్సులను డీసీజీఐకి పంపినట్లు చెప్పాయి. అయితే ఈ సిఫార్సులపై డీసీజీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, దీని కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్-E ద్వారా అభివృద్ధి చేయబడిన, Corbevax కోవిడ్-19కి వ్యతిరేకంగా భారతదేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన RBD ప్రోటీన్ సబ్-యూనిట్ వ్యాక్సిన్. ఈ ఏడాది మార్చి 16 నుంచి 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు కార్బెవాక్స్‌ను అందజేస్తున్నారు.


 టీకా డ్రైవ్ క్లుప్తంగా...  

జనవరి, 2021: టీకా డ్రైవ్ జనవరి 16, 2021న ప్రారంభమైంది. తొలి దశలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు  టీకాలు తీసుకున్నారు. 

ఫిబ్ర‌వ‌రి 2021: ఆ త‌రువాత గత ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఫ్రంట్‌లైన్ కార్మికులకు టీకాలు వేయడం  ప్రారంభమైంది.

మార్చి, 2021: కోవిడ్-19 వ్యాక్సినేషన్ యొక్క తదుపరి దశ 60 ఏళ్లు పైబడిన వారికి,  45 ఏళ్లు లేదా ఆపై వ‌య‌సు గ‌ల అనారోగ్యులను టీకా వేయ‌డం ప్రారంభించారు. 

ఏప్రిల్, 2021: గత సంవత్సరం ఏప్రిల్ 1 నుండి 45 ఏండ్లు పై బ‌డిన వారందరికీ వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు. 

మే, 2021: ప్రభుత్వం తన వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విస్తరించింది.  గత ఏడాది మే 1 నుండి 18 సంవత్సరాలు పైబ‌డిన ప్రతి ఒక్కరికీ కరోనా వైరస్ నుండి టీకాలు వేయడానికి అనుమతించింది.

జనవరి, 2022:  15-18 ఏళ్ల లోపు ఉన్న‌ యుక్తవయస్కులకు జనవరి 3 నుంచి తదుపరి దశ టీకా ను  ప్రారంభించింది. అదనంగా..  జనవరి 10 నుండి హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి బూస్టర్ డోస్ అందిస్తున్నారు.  

ఏప్రిల్, 2022: ఏప్రిల్ 10 నుండి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్‌లలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కోవిడ్-19 బూస్టర్ డోస్ అనుమతించ బడుతుంది.
 
కాగా, దేశీయంగా తయారు చేసిన పిల్లల మూడో కరోనా వ్యాక్సిన్‌ కొర్బెవ్యాక్స్‌ను ప్రస్తుతం 12-14 ఏండ్ల వయసు పిల్లలకు ఇస్తున్నారు. బయోలాజికల్‌ ఈ అభివృద్ది చేసిన కరోనా టీకా వయోజనుల్లో అత్యవసర వినియోగం కోసం డిసెంబర్‌ 28న డీసీజీఐ అనుమతి ఇచ్చింది. 

Follow Us:
Download App:
  • android
  • ios