Asianet News TeluguAsianet News Telugu

దారితప్పి వచ్చిన బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. రూ.50వేలకు అమ్మేసి.. దారుణం...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాలిక మీద బీహార్ లో గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ తరువాత ఆ బాలికను రూ.50వేలకు వ్యభిచారనిర్వాహకురాలికి అమ్మేశారు.
 

uttarpradesh minor girl gang-raped and sold for Rs 50,000 in Bihar's Madhubani, 3 held
Author
First Published Oct 1, 2022, 11:38 AM IST

పాట్నా : బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుబని జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఆ బాలికను విక్రయించారు. ఈ కేసులో ఒక మహిళ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వీరిలో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. ఆ తరువాత ఓ మహిళా పింప్‌కు రూ.50,000లకు అమ్మేశారు. గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని మౌజిల్లాకు చెందిన బృందం సోనీదేవి అనే మహిళా పింప్ చెర నుంచి బాలికను రక్షించి కేసును చేధించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అరెస్టయిన వారిని జైనగర్‌లోని అశోక్ మార్కెట్‌లో నైట్‌గార్డు సోనీ దేవి, అర్జున్ యాదవ్, ఎలక్ట్రీషియన్ సాజన్ కుమార్‌గా గుర్తించారు.
జైనగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఆచార్య..పోలీసు డ్రైవర్, రామ్‌జీవన్ పాశ్వాన్ అనే చోకీదార్ పరారీలో ఉన్నారు. బాధితురాలు నెల రోజుల క్రితం తన సొంత ఊరు మౌ నుండి దారితప్పి మధుబని జిల్లా జైనగర్ పట్టణానికి చేరుకుంది. అశోక్ మార్కెట్‌లో ఒంటరిగా తిరుగుతుంటే ఆమెకు అర్జున్ యాదవ్ కనిపించాడు. ఆమె అతని సహాయం కోరింది. ఆమె ఒంటరిగా ఉందని గమనించిన అతను ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. తన ముగ్గురు స్నేహితులకు సమాచారం ఇచ్చి పిలిపించాడు. వారు నలుగురూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తరువాత ఒక గదిలో బందీగా ఉంచారు.

మైన‌ర్ పై 8 మంది గ్యాంగ్ రేప్.. ఆపై బెదిరింపులు.. వీడియో వైర‌ల్

అలా వారు ఆమె మీద పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. మిగతా తమకు తెలిసిన వారిని కూడా పిలిచి ఆమె మీద అత్యాచారం చేయించారు. కాగా, బాధితురాలు ఇంట్లో కనిపించకపోవడంతో మౌలోని పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే మౌ పోలీసుల బృందం మధుబని జైనగర్ పట్టణానికి చేరుకుంది. అనుమానంతో సోనీ దేవి ఇంటిపై దాడి చేసింది. అక్కడ ఆ బాలిక  ప్రాణాలతో బయటపడింది.

పోలీసులు వెంటనే ఆమెను రక్షించి, మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనను ధృవీకరిస్తూ జిల్లా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు జైనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంజయ్ కుమార్ తెలిపారు. ఇతర నిందితులను అరెస్టు చేసేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది. జైనగర్ ఎస్‌డిపిఓ మాట్లాడుతూ, "మావు పోలీసులు మహిళా పింప్ ఇంటిపై దాడి చేశారు. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణలో కొంతమంది నిందితుల పేర్లు మా వద్ద ఉన్నాయి" ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

Follow Us:
Download App:
  • android
  • ios