వెన్నులో వణుకు పుట్టించే ఘటన.. హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి వృద్ధురాలు సజీవదహనం..
ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి ఓ వృద్ధురాలు సజీవ దనహనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి ఓ వృద్ధురాలు సజీవ దనహనమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 80ఏళ్ల వృద్ధురాలు తన ఫ్లాట్‌లోని బాల్కనీలో నిలబడి ఉండి.. పొరపాటున విద్యుత్ హైటెన్షన్ వైర్ ను తాకింది. కరెంట్ తీగను తాకిన మరుక్షణంలోనే మహిళ శరీరంలో మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే ఆ వృద్ధురాలు సజీవ దహనం అయింది. ఆమె కాలిపోతుంటే.. స్థానికులు చూస్తూ వీడియోలు తీస్తూ ఉండిపోయారే తప్ప..ఆమెను రక్షించడానికి ముందుకు రాలేకపోయారు. ఈ ఘటన రబుపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిర్జాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Read Aslo: ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్.. ఎనిమిది మంది కూలీలు మృతి
సంఘటన ఎలా జరిగింది
రాహుల్ తన కుటుంబంతో కలిసి రబుపురా కొత్వాలి ప్రాంతంలోని మీర్జాపూర్ గ్రామంలో నివసిస్తున్నారు. రాహుల్ 80 ఏళ్ల అమ్మమ్మ అంగూరీ దేవి శనివారం మధ్యాహ్నం తన ఇంటి బాల్కనీలో ఉండి.. తన మనవడిని పిలుస్తుంది. ఈ క్రమంలో ఆమె చేతికి 11,000 వోల్టుల విద్యుత్ లైన్ తగిలింది.కరెంట్ తీగను తాకిన మరుక్షణంలోనే మహిళ శరీరంలో మంటలు చెలరేగాయి. అక్కడికక్కడే ఆ వృద్ధురాలు సజీవ దహనం అయింది. అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన చూసిన జనం ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది.
Read Aslo: భద్రత వైఫల్యం.. గవర్నర్ కాన్వాయ్ పైకి దూసుకొచ్చిన కారు.. ఇద్దరి అరెస్టు
బంధువుల ఆందోళన
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని అంగూరి దేవి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఇంటి బయట హైటెన్షన్ లైన్ వెళుతోంది. వాటిని తొలగించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదనీ, ఈ కారణంగానే నేడు 80 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత బంధువులు పెద్దఎత్తున వీరంగం సృష్టించారు.
Read Aslo: 12 ఏండ్ల బాలికపై 'నిర్భయ' తరహాలో సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ లో కర్రను చొప్పించి..
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నినాదాలు చేశారు. ఈ ఘటనలో మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి హత్యా సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కేసులో మహిళ మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు రబుపురా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఈ కేసులో ఫిర్యాదు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.