Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్.. ఎనిమిది మంది కూలీలు మృతి

ఎలక్ట్రిక్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్ తగలడంతో ఎనిమిది మంది కూలీలు చనిపోయారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. 

Eight laborers died due to electric shock while erecting an electric pole..ISR
Author
First Published May 30, 2023, 7:57 AM IST

జార్ఖండ్ లో విషాదం చేసుకుంది. ధన్ బాద్ జిల్లాలో ఎలక్ట్రిక్ట్ పోల్ నిలబెడుతుండగా కరెంట్ షాక్ రావడంతో ఎనిమిది మంది కూలీలు మరణించారు. హైటెన్షన్ ఓవర్ హెడ్ వైర్ పడటంతో ఈ ఘటన జరిగింది. రాంచీకి 145 కిలోమీటర్ల దూరంలోని నిచిత్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగిందని బాగ్మారా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిషా ముర్ము తెలిపారు.

నిర్మల్ లో విషాదం.. తేనెటీగల దాడి నుంచి తప్పించుకోవాలని బావిలో దూకిన యువకుడు.. ఈతరాకపోవడంతో..

కూలీలంతా ఓ చిన్న కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారని, ఘటన అనంతరం వారు అక్కడి నుంచి పరారయ్యారని అధికారులు చెప్పారు. రైల్వే గేట్ సమీపంలో 25000 వోల్టుల హై టెన్షన్ వైర్‌ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ ఇటీవల కింద పడిపోయింది. దానిని సరి చేసి, నిలబెట్టేందుకు ఈ కూలీలంతా పనికి వెళ్లారు. ఈ క్రమంలో వారంతా అనుకోకుండా హై ఓల్టేజ్ కరెంట్ ప్రవహించే వైర్ కు తగిలారు. దీంతో ఒక్క సారిగా వారికి కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోగా.. పలువురికి గాయాలు అయ్యాయి.

పాకిస్థాన్ ను కూడా హిందూ దేశంగా మారుస్తాం - బాగేశ్వర్ ధామ్ ధీరేంద్ర శాస్త్రి

ఈ విషయం తెలుసుకున్న ధన్ బాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ కమల్ కిశోర్ సిన్హా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు ధృవీకరించారు. దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.

ఈదురు గాలుల బీభత్సం.. అమాంతం నేలకూలిన మొబైల్ టవర్.. ఎక్కడంటే ? (వీడియో)

కూలీలు ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండా, కరెంట్ ను నిలిపివేయకుండా పని చేశారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మొత్తంగా ఇక్కడ పది మంది పని చేశారని, ప్రాణాలతో బయటపడిన ఇద్దరు భయంతో పరుగులు తీశారని చెప్పారు. కాగా.. ఈ ఘటనతో ధన్బాద్, గోమోహ్ జంక్షన్లలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి. గంటన్నర తర్వాత దాన్ని పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios