12 ఏండ్ల బాలికపై 'నిర్భయ' తరహాలో సామూహిక అత్యాచారం.. ప్రైవేట్ పార్ట్ లో కర్రను చొప్పించి..
మధ్యప్రదేశ్‌లోని సత్నాలో 12 ఏండ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో కర్ర చొప్పించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

దేశంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలకు అడ్డు కట్ట వేయలేకపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, పని ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాలు, ఆఖరికి సొంత ఇంట్లోనే మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా మధ్యప్రదేశ్ లోని సత్నా జిల్లాలో దారుణం జరిగింది. 12 ఏండ్ల బాలికపై ఇద్దరూ కామాంధుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ చిన్నారి పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఇష్టానూసారంగా ఆ బాలికపై దాడి చేస్తూ.. ప్రైవేట్ పార్ట్‌లో కర్రను చొప్పించారు. ఈ ఘటన స్థానికంగా అందరి హృదయాలను కదిలిచివేసింది.
వివరాల్లోకెళ్తే.. సత్నా జిల్లాలోని మైహార్‌లోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పనిచేస్తున్న ఇద్దరు కామాంధులు.. 12 ఏండ్ల బాలికను మయ మాటలు చెప్పి.. ట్రస్టు సమీపంలోని కొండపైకి తీసుకెళ్లి మైనర్‌పై సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా.. తమలోని రాక్షసుడ్ని బయటపెట్టారు. బాలిక శరీరంపై గాయాలు చేస్తూ.. రాక్షస అనందాన్ని పొందారు. ఈ సమయంలో ఆ అమాయకురాలి ప్రైవేట్ పార్ట్‌లో కర్రను చొప్పించి.. తమ ఉన్మాదాన్ని చాటుకున్నారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆ మైనర్ బాలిక రక్తంతో తడిసి ఇంటికి చేరుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు బంధువులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. వాంగ్మూలం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ సత్నా అశుతోష్ గుప్తా తెలిపారు.
అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు శారదా మేనేజ్‌మెంట్ కమిటీలో సభ్యులుగా ఉన్నట్లు సమాచారం. సత్నా జిల్లాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం రీవా మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు.