సారాంశం

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కాన్వాయ్ లో భద్రత లోపం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని నల్లటి స్కార్పియో అకస్మాత్తుగా కాన్వాయ్‌లోకి ప్రవేశించింది.  అందులోని కారును ఢీకొట్టింది. ఇందుకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని నొయిడా పోలీసులు తెలిపారు.
 

కేరళ (Kerala) గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ (Arif Mohammad Khan) కాన్వాయ్‌లో భద్రత వైఫల్యం చోటుచేసుకుంది. గవర్నర్ కాన్వాయ్ లోకి ఓ కారు దూసుకొచ్చిన ఘటన‌ సంచలనంగా మారింది. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్-77లో జరిగిన ఒ ప్రైవేటు కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆయన కాన్వాయ్‌ను వేగంగా వచ్చిన నల్లటి స్కార్పియో ఢీకొట్టింది. దీంతో భద్రతా ఉల్లంఘన జరిగింది. గవర్నర్ రక్షణలో ఉన్న భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో పోలీసులు నిందితులిద్దర్ని 
అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఇందుకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని నొయిడా పోలీసులు తెలిపారు.
 
వివరాల్లోకెళ్లే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్-77లో ఉన్న హౌసింగ్ సొసైటీలో శుక్రవారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పాల్గొన్నారు. కార్యక్రమం ముగించుకుని అక్కడి  నుండి వెళ్తుండగా స్పెక్ట్రమ్ మాల్ సమీపంలో కేరళ గవర్నర్ కాన్వాయ్ లోకి అకస్మాత్తుగా గుర్తుతెలియని నల్లటి స్కార్పియో చొరబడి.. కాన్వాయ్ కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో  భద్రత లోపం తెరపైకి వచ్చింది.

ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తృటిలో తప్పించుకున్నాడు. వారికి ఎలాంటి హాని జరగదు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీస్ స్టేషన్-113 పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కారు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత గవర్నర్‌ను సురక్షితంగా నోయిడా మీదుగా ఢిల్లీకి తరలించారు.