Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ టార్షన్ రాకెట్: ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదికారులు వారి టార్గెట్

సెక్స్ టార్షన్ రాకెట్ గుట్టును ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలను, ఎంపీలను, అధికారులను ఆ రాకెట్ లక్ష్యం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Using fake profiles women group cheats mPs, MLAs
Author
Mumbai, First Published Feb 22, 2021, 4:35 PM IST

ముంబై: ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాధికారులను లక్ష్యంాగ చేసుకుని సాగుతున్న సెక్స్ టార్షన్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశఆరు ఈ రాకెట్ తో సంబంధం ఉన్న రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం ఆరెస్టు చేశారు. 

మహిళల ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకుంటుంది. ఆ తర్వాత వారాంతంలో వాట్సప్ వీడియో కాల్స్ ద్వారా మరింత సన్నిహితమవుతుంది. కొంత కాలం తర్వాత పోర్న్ వీడియోలు చూసే విధంగా వారిని ప్రోత్సహిస్తుంది. పోర్న్ వీడియోలను చూస్తున్న సమయంలో ఓ యాప్ ద్వారా వారి ముఖ కవళికలను రికార్డు చేస్తుంది. 

ఆ తర్వాత ఆ వీడియోలను ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామంటూ డబ్బులు డిమాండ్ చేస్తుంది. మొదట్లో తక్కువ డబ్బులు అడిగి, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తూ వస్తుంది. 

ఈ ముఠా 171 ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలను, నాలుగు టెలిగ్రామ్ చానల్స్ ను, 54 మొబైల్ ఫోన్లను వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసిన తర్వాత 58 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios