Asianet News TeluguAsianet News Telugu

COVID-19: కేంద్ర మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండేకు క‌రోనా.. మ‌రో బీజేపీ నేత‌కు సైతం..

COVID-19: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం కలకలం సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండేకు క‌రోనా వైర‌స్ సోకింది. 
 

Union Minister Mahendra Nath Pandey Also Corona Infected
Author
Hyderabad, First Published Jan 4, 2022, 12:13 PM IST

COVID-19: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మ‌రో కేంద్ర మంత్రి క‌రోనా బారిన‌ప‌డ్డారు. కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండేకు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది. సోమ‌వారం ఆయ‌న్ను ఢిల్లీలోని ఆస్ప‌త్రిలో చేరారు.  68 సంవ‌త్స‌రాలున్న ఆయ‌న చందౌలీ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.  గ‌తంలోనూ ఓసారి ఆయ‌న‌కు క‌రోనా సోకింది. కౌసంబీలోని య‌శోద హాస్పిట‌ల్‌లో మంత్రి చేరారు. రెండు రోజుల నుంచి అస్వ‌స్థ‌త‌తో ఉన్నాన‌ని, కోవిడ్ ప‌రీక్ష చేయించుకుంటే, పాజిటివ్‌గా వ‌చ్చింద‌ని, త‌న‌తో కాంటాక్ట్‌లోకి వ‌చ్చిన‌వారంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో కోరారు. క‌రోనా ప్రోటోకాల్ ప్ర‌కారం  వైద్యం తీసుకుంటున్నాన‌ని తెలిపారు.  ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా హాస్పిట‌ల్‌లో చేరాన‌ని, ప్ర‌స్తుతం ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు.

Also Read: Modi: పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ.. ఎన్నిక‌ల ల‌క్ష్యంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం !

అలాగే, బీజేపీ చెందిన ఎంపీ మ‌నోజ్ తివారీకి కూడా క‌రోనా సోకింది. ఆయ‌న కూడా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలారు. స్వ‌ల్పంగా జ్వ‌రం, జ‌లుబు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఇటీవల తనను కలిసివారంతా  జాగ్రత్తగా ఉండాలని , టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘నాకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అందుకే స్వయంగా ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసినవారు. నాతో దగ్గరగా మెలిగినవారు టెస్టులు చేయించుకోండి. సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. 

Also Read: coronavirus: భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం..37 వేల‌కు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..

 

 

Also Read: Omicron: ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. ఈ ఏడాది ముగిసే క‌ల్లా.. డ‌బ్ల్యూహెచ్‌వో కీల‌క వ్యాఖ్య‌లు !

ఇదిలావుండగా, దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో దేశంలో 37,379 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా వైర‌స్ కేసులు 3,49,60,261 కు చేరాయి. క్రియాశీల కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త‌గా 11 వేల మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 రిక‌వ‌రీల సంఖ్య 3,43,06,414కు పెరిగింది. దాదాపు 117 రోజుల త‌ర్వాత అత్య‌ధికంగా ఒక‌రోజు కోవిడ్ కేసులు ఇవేన‌ని గ‌ణాకాంలు పేర్కొంటున్నాయి. అలాగే, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్త క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,82,071 చేరింది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 98.2 శాతంగా ఉంది. మ‌ర‌ణాల రేటు 1.38 శాతంగా ఉంది. అయితే, క‌రోనా పాజిటివిటీ రేటు క్ర‌మంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా వారంత‌పు పాజిటివిటీ రేటు 5.1 శాతంగా ఉంది.

Also Read: coronavirus: మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ మొద‌లు.. క‌రోనా పంజాతో స్కూల్స్ క్లోజ్

Follow Us:
Download App:
  • android
  • ios