Asianet News TeluguAsianet News Telugu

Modi: పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ.. ఎన్నిక‌ల ల‌క్ష్యంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం !

Assembly Elections2022:  త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్రాల్లో వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌ధాని మోడీ సహా కేంద్ర మంత్రులు శ్రీ‌కారం చుడుతున్నారు.  బుధ‌వారం నాడు (ఈ నెల 5న‌) పంజాబ్‌లో ప్ర‌ధాని మోడీ పర్య‌టించ‌నున్నారు. రూ.42,750 కోట్ల విలువైన పనులకు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. 
 

PM Narendra Modi to visit Punjab on 5th January and lay the foundation stone of multiple development projects worth more than Rs 42,750 crore
Author
Hyderabad, First Published Jan 4, 2022, 11:40 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

Assembly Elections2022: దేశంలో ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైంది. త్వ‌ర‌లో ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌లు మినీ సంగ్రామాన్ని త‌ల‌పిస్తున్నాయి. ఈ ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌, గోవా, పంజాబ్ ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఈ నేప‌థ్యంలోనే పంజాబ్ లో పాగా వేయాల‌ని అన్ని పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎలాగైన అధికారం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్ర‌ధాని మోడీ సహా కేంద్ర మంత్రులు ఎన్నిక‌లు జ‌ర‌గనున్న రాష్ట్రాల్లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. ప్ర‌ధాని మోడీ ఈ నెల 5న (బుధ‌వారం) పంజాబ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఫిరోజ్​పుర్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన శాటిలైట్ సెంటర్‌ను ప్ర‌ధాని మోడీ ప్రారంభించనున్నారు. మొత్తం రూ.42,750 కోట్లకుపైగా విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: coronavirus: భార‌త్ లో క‌రోనా క‌ల్లోలం..37 వేల‌కు పైగా కొత్త కేసులు.. 1892 ఒమిక్రాన్ కేసులు..

పంజాబ్ ప‌ర్య‌ట‌లో భాగంగా ప్ర‌ధాని మోడీ ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌, ఢిల్లీ నుంచి కత్రా వరకు నాలుగు లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగ‌నున్నాయి. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం ద్వారా ప్రయాణ సమయం తగ్గిపోనుంది. అలాగే ప్రధాన మత కేంద్రాలు, ముఖ్య సిక్కు మతపరమైన ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీని పొందేందుకు ప్రధాని ప్రత్యేక దృష్టి సారించనున్నారు.  వైష్ణో దేవి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు సైతం ప్ర‌ధాని మోడీ నిర్వహించ‌నున్నారు. ముకేరియన్‌-తల్వారా కొత్త బ్రాడ్‌ గేజ్‌ రైలు మార్గానికి ప్రధాని మోడీ పునాదిరాయి వేయనున్నారు. రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవ‌లు అందించ‌డానికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఇదివ‌ర‌కే ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో దీనికి సంబంధించి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఫిరోజ్‌పూర్‌లో PGI శాటిలైట్ సెంటర్, కపుర్తలా, హోషియార్‌పూర్‌లో రెండు వైద్య కళాశాలలకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Also Read: coronavirus: మ‌హారాష్ట్రలో మ‌ళ్లీ మొద‌లు.. క‌రోనా పంజాతో స్కూల్స్ క్లోజ్

అలాగే, రాష్ట్రంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకోనున్నారు. దీనిలో భాగంగా రోడ్ల విస్త‌ర‌ణ‌కు సంబంధించి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. పంజాబ్‌లో రెండు ప్రధాన రహదారి కారిడార్‌లకు పునాది రాయి పడనుంది. 669 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం రూ.39,500 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది ఢిల్లీ నుండి అమృత్‌సర్ మరియు ఢిల్లీ నుండి కత్రాకు ప్రయాణ సమయాన్ని సగానికి తగ్గిస్తుంది. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే సుల్తాన్‌పూర్ లోధి, గోయింద్‌వాల్ సాహిబ్, ఖాదూర్ సాహిబ్, తార్న్ తరణ్ మరియు కత్రాలోని వైష్ణో దేవి యొక్క పవిత్ర హిందూ పుణ్యక్షేత్రాల వద్ద కీలకమైన సిక్కు మత స్థలాలను కలుపుతుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు/యూటీలలో అంబాలా చండీగఢ్, మొహాలి, సంగ్రూర్, పాటియాలా, లూథియానా, జలంధర్, కపుర్తలా, కథువా మరియు సాంబా వంటి కీలక ఆర్థిక కేంద్రాలను కూడా ఎక్స్‌ప్రెస్‌వే కలుపుతుంది. ప‌ర్య‌ట‌న ముగించుకుని తిరుగు ప్ర‌యాణంలో ర్యాలీలో పాల్గొంటార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండ‌గా, ఈ రోజు ప్ర‌ధాని మోడీ త్రిపుర‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్నారు. 

Also Read: Omicron: ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. ఈ ఏడాది ముగిసే క‌ల్లా.. డ‌బ్ల్యూహెచ్‌వో కీల‌క వ్యాఖ్య‌లు !

Follow Us:
Download App:
  • android
  • ios