Asianet News TeluguAsianet News Telugu

ఓ వైపు పౌరసత్వ రగడ: పాక్ మహిళకు భారత పౌరసత్వం

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఈశాన్య, ఉత్తర భారతదేశాలకే పరిమితమైన ఈ ఆందోళనలు దక్షిణాదికి సైతం వ్యాపిస్తున్నాయి. 

Union GOVT GRANTS INDIAN CITIZENSHIP TO PAK WOMAN
Author
New Delhi, First Published Dec 20, 2019, 3:20 PM IST

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఈశాన్య, ఉత్తర భారతదేశాలకే పరిమితమైన ఈ ఆందోళనలు దక్షిణాదికి సైతం వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఓ పాకిస్తానీ మహిళకు భారత పౌరసత్వం మంజూరైంది.

గుజరాత్‌లోని భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన హసీనా బెన్ మహిళ 1999లో వివాహానంతరం పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడి పౌరసత్వాన్ని స్వీకరించింది. అయితన తన భర్త మరణించడంతో తిరిగి మాతృదేశానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.

Also Read:పౌరసత్వ ఆందోళనలు: ఇండియన్ సిటిజన్‌షిప్‌పై ఆసక్తిచూపని టిబెటన్లు

ఈ క్రమంలో రెండు సంవత్సరాల క్రితం భారత పౌరసత్వం కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆమె అభ్యర్థిత్వాన్ని పరిగణనలోనికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 18న భారత పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ద్వారక జిల్లా కలెక్టర్ డా. నరేంద్రకుమార్ మీనా హసీనాకు భారత పౌరసత్వ ధ్రువ పత్రాన్ని అందజేశారు. 

పౌరసత్వ సవరణ చట్టంపై భారత్‌లో నివసిస్తున్న ఇతర దేశస్థుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న బౌద్ధులు భారత పౌరసత్వం పట్ల వారు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని ముస్లిమేతరులందరికీ భారతదేశంలో పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించినప్పటికీ ప్రత్యేక టిబెట్ కోసం దశాబ్ధాలు పోరాడుతూ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న వేలాదిమంది బౌద్ధ భిక్షవులు మాత్రం తమకు ఇండియన్ సిటిజన్‌షిప్ అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

Also read:పౌరసత్వ రగడ: ఎర్రకోట వద్ద రణరంగం, ప్రముఖుల అరెస్ట్

టిబెట్‌లో జరిగిన స్వతంత్ర పోరాటాల సందర్భంగా 1959లో వేలసంఖ్యలో ప్రజలు భారత్‌కు తరలివచ్చారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు, చామరాజనగర్, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

దీర్ఘకాలంగా భారత్‌లో నివసిస్తున్నప్పటికీ వారు ఎలాంటి పౌరసత్వం మాత్రం పొందలేదు. వారి వద్ద ఒక్క పాస్‌పోర్ట్ మినహా ఆధార్‌కార్డ్, ఓటరు గుర్తింపు కార్డులు లేవు. కాగా భారతదేశంలో 1960 నుంచి 1987 వరకు జన్మించిన టిబెటియన్‌లకు పౌరసత్వం కల్పిస్తున్నా దీనిని తీసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపటం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios